Advertisement
Google Ads BL

సలార్ 2 లోకి ఎన్టీఆర్ హీరోయిన్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో గత ఏడాది విడుదలై సన్సెషనల్ హిట్ అయిన మాస్ మూవీ సలార్ పార్ట్ 1 కి సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుంది. సలార్ 2 షూటింగ్ ఈ నెల చివరి నుంచి కానీ మే మొదటి వారం నుంచి కానీ ప్రారంభం కానుంది, ఇప్పటికే ప్రశాంత్ నీల్ సలార్ 2 స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అలాగే నటులు ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, హీరోయిన్ శృతి హాసన్ డేట్స్ ని సెట్ చేసుకుంటున్నారు. సలార్ పార్ట్ 1 లో శృతి హాసన్ హీరోయిన్. ఆద్య పాత్రలో ఆమె సింపుల్ గా కనిపించింది. అయితే సలార్ 2 లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుస్తోంది. సలార్1 తో పోల్చితే సలార్‌ 2 రెట్టింపు యాక్షన్‌ తో పాటు, ఎమోషన్స్‌ తో కూడుకున్నదిగా ఉండబోతుందట. దానికి తగ్గట్టుగా కాస్త గ్లామర్ డోస్ కూడా యాడ్ చేయబోతున్నారట. 

దానిలో భాగంగానే మరో హీరోయిన్ కోసం ప్రశాంత్ నీల్ వేట మొదలు పెట్టగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కియారా అయితే బావుంటుంది అనే ఆలోచనలో ఉండడమే కాకుండా.. కియారా అద్వానీని సంప్రదించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా టాక్. ఎన్టీఆర్ తో వార్ 2, చరణ్ తో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్న కియారా కి సలార్ 2 ఛాన్స్ వస్తే అదృష్టం తగిలినట్లే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన జోడి అంటే అంతే మరి. 

Kiara advani for Salaar 2:

Kiara Advani to pair up with Prabhas?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs