Advertisement
Google Ads BL

రూట్ మార్చిన రాజశేఖర్


సీనియర్ హీరో రాజశేఖర్ కేవలం హీరో పాత్రలే కావాలని కూర్చోకుండా యంగ్ హీరోల సినిమాల్లో కొత్త పాత్రల్లో కనిపిస్తున్నారు. అలా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో కనిపించిన నితిన్ ఎక్సట్రార్డినరీ మ్యాన్ ఆయనకి బిగ్ షాక్ ఇచ్చింది. ఆ చిత్రం ఆయన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ చిత్రం తర్వాత రాజశేఖర్ పేరు పెద్దగా వినిపించలేదు. 

Advertisement
CJ Advs

తాజాగా రాజశేఖర్ చేతికి ఓ బిగ్ ప్రాజెక్టు వచ్చింది అనే టాక్ వినిపిస్తోంది. నిఖిల్ స్పై చిత్రంతో దర్శకుడిగా మారిన గ్యారీ రాజశేఖర్ కోసమే స్పెషల్ గా కథ రాసుకుని.. దీనిని ప్రొడ్యూస్ చేసేందుకు గ్యారీ అమెజాన్ ప్రైమ్ సంస్థ దగ్గరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అమేజాన్‌ వారికీ గ్యారీ రాసిన  క‌థ బాగా న‌చ్చి, ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది అంటున్నారు. 

అంతేకాదు రాజశేఖర్ చిత్రం కోసం అమెజాన్ వారు ఏకంగా రూ.60 నుంచి రూ.70 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో రాజశేఖర్ తో పాటుగా మరో ఇద్దరు యాంగ్ హీరోలు కూడా కనిపిస్తారని సమాచారం.

మరోపక్క రాజశేఖర్ హీరో శర్వానంద్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే న్యూస్ కూడా బాగా హైలెట్ అయ్యింది. 

Rajasekhar who changed the route:

Actor Rajasekhar new project update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs