కొద్దిరోజులుగా అభిమానులకి దర్శనమివ్వని సూపర్ స్టార్ మహేష్ బాబు.. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దుబాయ్ నుంచి రాజమౌళి అలాగే SSMB 29 నిర్మాత తో కలిసి మహేష్ వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మహెష్ కనిపించినా అప్పుడు ఆయన కొత్త లుక్ సరిగ్గా రివీల్ అవ్వలేదు.
లాంగ్ లో హెయిర్ కనిపించగా.. దానికి క్యాప్ పెట్టి కవర్ చేసారు ఆయన. అలాగే కొద్దిగా గెడ్డం కూడా పెంచి కనిపించడంతో మహెష్ కొత్త లుక్ ప్రోపర్ గా చూసేవరకు మహేష్ అభిమానులు ఆగేలా కనిపించలేదు. ఎందుకంటే మహేష్ SSMB 29 కోసం స్పెషల్ మేకోవర్ అవుతున్నారనే టాక్ ఉండడంతో ఆయన కొత్త లుక్ పై అందరిలో స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపించింది.
తాజాగా పాట్ కమ్మిన్స్ టాలీవుడ్ ప్రిన్స్ ని కలవడం ఆనందంగా ఉంది అంటూ మహేష్ తో దిగిన పిక్ ని షేర్ చేసారు. దానికి రిప్లై గా మహేష్ బాబు An absolute honour! A big fan! 🤗🤗🤗 ట్వీట్ చేసారు. ఆ పిక్ లో మహేష్ లుక్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. హెయిర్ బాగా పెంచి చిన్నపాటి గెడ్డంతో బ్లాక్ షర్ట్ లో మహేష్ సూపర్ మేకోవర్ లో కనిపించడంతో ఆయన అభిమానులు చాలా సర్ ప్రైజ్ అవుతున్నారు. మరి మహేష్ ఈ కొత్త లుక్ SSMB 29 కోసమే అని అందరూ మాట్లాడుకుంటున్నారు.