మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు జనసేన పార్టీ కి ఐదుకోట్ల విరాళమివ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ కష్టాన్ని గుర్తించమని, మంచి నాయకుణ్ణి ఎన్నుకోమంటూ చిరంజీవి ప్రత్యక్షంగానే జనసేనకు తన మద్దతుని ప్రకటించారు. అయితే మెగాస్టార్ చిరు అనూహ్యంగా తన అభిమానులైన బిజెపి నేత సీఎం రమేష్ ని, పంచకర్ల రమేష్ బాబు ని గెలిపించమంటూ తన ఇంట్లోనే ఉండి.. వాళ్లిద్దరికి తన మద్దతుని ప్రకటించారు.
అయితే ఇంట్లోనుంచి ఎన్నికల ప్రచారం చేస్తారా.. చిరు గ్రౌండ్ లోకి దిగి ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చెయ్యరా అని జనసైనికులు మెగాస్టార్ ని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారం చేస్తే పవన్ కి హెల్ప్ అవుతుంది.. జనసేనకి సపోర్ట్ దొరుకుతుంది అనేది జనసైనుకుల ఆశ.
మరి మెగాస్టార్ చిరు ఇలా ఇంట్లోనే ఉండి తన కిష్టమైన కేండిడేట్స్ ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారా.. లేదంటే పవన్ కోసం గ్రౌండ్ లోకి దిగి ప్రజల్లో చైతన్యం తెచ్చి తమ్ముడి గెలుపు కోసం కష్టపడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే కొంతమంది మెగా అభిమానులు మాత్రం చిరు గ్రౌండ్ లోకి దిగకపోయినా.. తమ్ముడి కోసం ఐదుకోట్ల పార్టీకి విరాళం ఇచ్చారు అది చాలు. తమ్ముడిని గెలిపించమని చిరు అడగకపోయినా.. ఈసారి మెగా ఫాన్స్ సపోర్ట్ పవన్ కి ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు.