గీత గోవిందం కాంబో విజయ్ దేవరకొండ-పరశురామ్ కలిసి మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఎన్ని అంచనాలు ఏర్పడతాయో ఫ్యామిలీ స్టార్ పై అన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ పోస్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే రకరకాల నెగెటివ్ కామెంట్స్ స్ప్రెడ్ అయినా దిల్ రాజు ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతాయనుకుంటే.. విజయ్ దేవరకొండ పై ఉన్న నెగిటివిటి ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ లో మాత్రమే కాదు, కలెక్షన్స్ విషయంలోనూ దెబ్బేసింది.
విడుదలైన నెక్స్ట్ మినిట్ లోనే సినిమాపై నెగిటివ్ ప్రభావం ఎక్కువైంది. థియేటర్స్ లో సో సో గా ఆడిన ఫ్యామిలీ స్టార్ ని ఓటీటీ లో వీక్షించేందుకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారం లో విడుదలైన ఫ్యామిలీ స్టార్ మే ఫస్ట్ వీక్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనుకుంటూ ఎదురు చూస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకున్న ఫ్యామిలీ స్టార్ ని మే 6 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్. అంతేకాదు మే 3 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నారని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ముందుగా తెలుగు అండ్ తమిళ భాషల్లో ఓటీటీలోకి వదలనున్నారట. అయితే, ఈ సినిమాను ముందు రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేయనున్నారని ట్విటర్ వేదికగా పోస్టులు వెలువడుతున్నాయి.
రూ. 100 లేదా రూ. 120 చెల్లించి అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్‌ను వీక్షించేలా ఓటీటీ సంస్థ అందుబాటులోకి తీసుకురానుందట. థియేటర్లు లో భారంగా నడిచిన ఫ్యామిలీ స్టార్ ని రూ. 100 లేదా రూ. 120 ఇచ్చి రెంటల్ విధానంలో ఓటీటీలో చూసేందుకు ఎవ్వరూ ఇష్టపడకపోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.