అనకాపల్లి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ ట్విస్ట్.. అంతకుమించి బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నారట. భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాసరావును తప్పించనున్నారట. అవంతిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లు వైసీపీ వర్గాల విశ్వసనీయ సమాచారం. కూటమి తరఫున పోటీచేస్తున్న సీఎం రమేష్‌ను ఎదుర్కోవడానికి.. ఓడించడానికి సమర్థుడు, సరైనోడు అవంతి మాత్రమేనని వైసీపీ హైకమాండ్ గట్టిగా విశ్వసిస్తోందట. ఈ వార్త కూటమికి ఒకరకంగా గుడ్ న్యూస్.. మరో రకంగా బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు.
ఎందుకబ్బా..!
అవంతిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే అనకాపల్లి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే.. టీడీపీ ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి.. ఎంపీగా పనిచేసిన అనుభవం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నేతలతో పరిచయాలున్న మనిషి.. అన్ని నియోజకవర్గాల గురించి తెలిసిన నేత కావడంతో ఈయన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని వైసీపీ భావిస్తోంది. కాపు కమ్యూనిటి, అవంతి ఆర్థిక, అంగ బలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థిగా అవంతిని ఇవాళ్టి అనకాపల్లి సభలో ప్రకటించబోతున్నారట.
గుడ్.. బ్యాడ్ న్యూస్ కూడా!
సీఎం రమేష్‌కు సమవుజ్జీ.. డబ్బులో, పలుకుబడి, సీనియార్టీలో అవంతి ఏ మాత్రం తీసిపోరు. అందుకే ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా ఉన్న బూడి ముత్యాల నాయుడిని పక్కనెట్టి శ్రీనివాసరావును రంగంలోకి దింపుతున్నారట. ఇదే జరిగితే కూటమి అభ్యర్థికి బ్యాడ్ న్యూసేనని చెప్పుకోవచ్చు. ఇక భీమిలీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు గెలుపు నల్లేరు మీద నడకే. ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకూ గంటా గెలుపు కాస్త డౌటే అని టీడీపీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. అవంతి అటు వెళ్తే గంట గట్టిగానే మోగే ఛాన్స్ ఉంది. మరి గంటాపై వైసీపీ అభ్యర్థి ముత్యాల నాయుడేనా లేకుంటే.. వేరొకరిని జగన్.. బరిలోకి దింపుతారా అనేది తెలియాలంటే శనివారం సాయంత్రంతో క్లారిటీ రానుంది.