Advertisement
Google Ads BL

చోటా కె. నాయుడుకి హరీష్ శంకర్ కౌంటర్


హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్య సినిమా షూటింగ్‌లో తను చెప్పిన మాట వినలేదని, ముందు కాస్త కోపం వచ్చినా.. తనే తగ్గి.. అతను చెప్పింది చేయాల్సి వచ్చిందని చోట కె నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలకు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌లో ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఏముందంటే..

Advertisement
CJ Advs

(వయసులో పెద్ద కాబట్టి)

గౌరవనీయులైన చోట కె నాయుడుగారికి నమస్తరిస్తూ.. 

రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది

ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా

కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు

మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు

మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది

కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడు..

అని పదిమంది పది రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. 

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే

గబ్బర్‌సింగ్ వచ్చినప్పుడు నాది రామయ్య వస్తావయ్య వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. 

మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, 

నా ప్రస్తావన రాకున్నా, 

నాకు సంబంధం లేకున్నా, 

నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను

అభిమానించే వాళ్లు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది.

మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను

అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. 

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.

కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే.. 

any day

any platform

I AM WAITING

-భవదీయుడు హరీష్ శంకర్

Harish Shankar warning to Chota K Naidu:

Harish Shankar open letter to Chota K Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs