నందమూరి బాలకృష్ణ ఈ మద్యన సక్సెస్ ఊపులో ఉన్నారు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ మూడ్ లో ఉన్నారు. హిందూపురం నుంచి ఎమ్యెల్యేగా కూడా హ్యాట్రిక్ కొట్టే దిశగా పరుగులు పెడుతున్నారు. గత వారం రోజులుగా బాలయ్య ఎన్నికల ప్రచారంలో యాక్టీవ్ గా కనబడుతున్నారు.
తాజాగా బాలకృష్ణ ఈ శుక్రవారం హిందూపురంలో నామినేషన్ వేశారు. బాలయ్య నామినేషన్ ఘట్టాన్ని తిలకించేందుకు, ఆయనకు సపోర్ట్ గా నిలిచేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ర్యాలీగా తరలి వచ్చారు. సతీమణి వసుంధరతో కలిసి సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ వేశారు.
అయితే నామినేషన్ తో పాటుగా బాలయ్య తన ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్ లో చూపించాల్సి ఉంటుంది. అందులో భాగంగా బాలయ్య తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్ లో చూపించారు. అందులో ఉన్న వివరాల ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా, ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలుగా ఉంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది. అటు, అప్పులకు సంబంధించి బాలకృష్ణకు రూ.9 కోట్లు 9 లక్షల 22 వేలు అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా బాలయ్య భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలుగా అఫిడవిట్ లో బాలయ్య చూపించారు.
దానితో ఒక్కసారిగా బాలకృష్ణ ఆస్తుల విలువ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. బాలయ్యకి ఇన్ని ఆస్తులున్నాయా, ఇంత అప్పుందా అంటూ ఆయన అభిమానులు చర్చించేసుకుంటున్నారు.