Advertisement
Google Ads BL

శిల్పా శెట్టి కి బిగ్ షాక్


ఇప్పటికే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా బ్లూ ఫిలిమ్ కేసులో చాలా సమస్యలు ఎదుర్కొంది. ఈ కేసులో రాజ్ కుంద్రా కొన్నాళ్ళు జైలు జీవితాన్ని గడిపి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. అయితే శిల్పాశెట్టి దంపతులు మరోసారి చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‏కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాల కేసు శిల్పా శేట్య్ జంటకి చుట్టుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శిల్పాశెట్టికి ఆమె భర్త రాజ్ కుంద్రాకు షాకిచ్చింది.

Advertisement
CJ Advs

2017లో రాజ్ కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్ కాయిన్ బిజినెస్ కి తెర లేపాడు. బిట్ కాయిన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటూ అమాయక ప్రజలను మోసం చేసి దాదాపు రూ. 6600 కోట్లు సంపాదించారు. బిట్ కాయిన్ లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు. కానీ డబ్బు చేతికి వచ్చాక రాజ్ కుంద్రా మోసం చేసాడు. దానితో రాజ్ కుంద్రా పై పలు చాట్ల ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. రాజ్ కుంద్రా స్కామ్ చేశాడని.. ఇది ఒక రకమైన పోంజీ స్కీమ్ అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రాజ్ కుంద్రా వద్ద ఉన్న 285 బిట్ కాయిన్ల విలువ రూ.150 కోట్ల కంటే ఎక్కువ. ఈ కేసులో ఈడీ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. 

క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ కి సంబంధించి మనీలాండరింగ్ మోసాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లకు చెందిన దాదాపు 100 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. శిల్పా శెట్టి పేరు మీద ఉన్న ముంబైలోని జుహు ప్లాట్ తో పాటు, పూణేలోని బంగ్లాను, రాజ్ కుంద్రా కు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసింది.

Big shock for Shilpa Shetty:

ED Seizes Shilpa Shetty And Raj Kundra Properties
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs