నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్నాక ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా కనిపిస్తుంది. కెరీర్ లో ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటుంది. నటన విషయం ఎలా ఉన్నా నిర్మాతగా నిహారిక ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతుంది. మరోపక్క ఆహా ఓటీటీ కోసం యాంకరింగ్ చేస్తుంది.
ఇక ఎప్పుడు మోడ్రెన్ దుస్తుల్ని ఇష్టపడే నిహారిక తాజాగా సమ్మర్ లుక్ లో షాకిచ్చింది. సమ్మర్ అవుట్ ఫిట్ కాదు కానీ.. ఎల్లో డ్రెస్ లో నిహారిక కాస్త కొత్తగా కనిపించింది. ఎల్లో డ్రెస్ లో టైట్ గా జడ కట్టి చేతులని అటు ఇటు తిప్పుతూ తీయించుకున్న ఫోటో షూట్ అది. ప్రస్తుతం నిహారిక కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.