Advertisement
Google Ads BL

నభ, ప్రియదర్శి గొడవ మధ్యలో రీతూ వర్మ


నభ నటేష్ కి-కమెడియన్ కమ్ హారో ప్రియాదర్షికి మధ్యన సోషల్ మీడియాలో సరదాగా ఓ గొడవ జరిగింది. రీతూ వర్మ రీసెంట్ గా ఓ బ్యూటిఫుల్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీతూ వర్మ ఫోటోషూట్ కింద ప్రియదర్శి  సరదాగా కామెంట్ పెట్టాడు. రీతు వర్మ క్యూట్ ఫోటో కింద వావ్ రీతూ డార్లింగ్ ఎంతందంగా ఉన్నావో, నీ అందానికి ముగ్దుడినయ్యాను, మాటలు కూడా రావడం లేదు అంటూ కామెంట్ పెట్టాడు 

Advertisement
CJ Advs

దానికి నభ నటేష్ ప్రియదర్శి కామెంట్ కి రిప్లై ఇస్తూ అతను మళ్ళీ మొదలు పెట్టాడు. ఆడవాళ్ళ కామెంట్ సెక్షన్ పై ఉన్నంట్లుండి ఆసక్తి చూపుతున్నాడు. ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలవడమేమిటి అంటూ కాస్త కోపంగా చెప్పింది.. దానికి మళ్ళీ ప్రియదర్శి స్పందిస్తూ.. నేను ఎవ్వరినైనా డార్లింగ్ అనే పిలుస్తా నీకేంటి అంటూ రిప్లై ఇచ్చాడు. 

అయితే వీరి గొడవ మధ్యలోకి అసలు హీరోయిన్ వచ్చింది. అదేనండి తన ఫోటో కింద కామెంట్స్ సెక్షన్ లో కొట్టుకుంటున్న నభ నటేష్ కి-ప్రియదర్శికి సున్నితంగా రిప్లై ఇచ్చింది రీతూ వర్మ. నా కామెంట్ సెక్షన్ మీ ఇద్దరి పంచాయితీ ఏమిటి అంటూ నిలదీసింది. ప్రస్తుతం నభ నటేష్-ప్రియదర్శి మధ్యలో రీతూ వర్మ అంటూ ఈ గొడవని సోషల్ మీడియాలో చూసి నెటిజెన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. 

Ritu Varma responded to Nabha Natesh Priyadarshi comments:

Ritu Varma Reacts On Priyadarshi and Nabha Natesh Darling Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs