థియేటర్స్ లో జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన మహేష్ బాబు-త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాకి మొదట నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా.. ఆతర్వాత కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపంచింది. గుంటూరు కారం పై కావాలని నెగిటివిటి స్ప్రెడ్ చేసారంటూ నిర్మాత నాగ వంశి పదే పదే మొత్తుకున్నాడు.
అదాల ఉంటే.. గుంటూరు కారం ఫిబ్రవరిలో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ నుంచి ఫిబ్రవరి 9 న ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చిన గుంటురు కారం ఎక్కువగా కుర్చీని మడతబెట్టి సాంగ్ తో తెగ హైలెట్ అయ్యింది. అపుడు డిజిటల్ ప్రీమియర్ గా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం గత వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.
తాజాగా గుంటూరు కారం సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి 9.23 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. బుల్లితెర ఆడియన్స్ నుంచి గుడ్ రెస్పాన్స్ అని చెప్పాలి. గత చిత్రం సర్కారు వారి పాటకి స్టార్ మా ఛానెల్ లో 9.45 టీఆర్పీ రేటింగ్ రాగా ఇప్పుడు గుంటూరు కారానికి 9.23 రేటింగ్ వచ్చింది.