జగన్ ప్రతి మీటింగ్ లో, మేము సిద్దమే బస్సు యాత్రలో పదే పదే చంద్రబాబుని పెత్తందారు అంటూ ఆయనకు ABN, TV 5, ETV ఛానల్స్ ఉన్నాయి. ఆయన ఆ మీడియాలో తన గురించి గొప్పలు చెప్పించుకుంటాడు, ఆ మీడియా అండ బాబు కి ఉంది, ఆయనకు బోలెడంత డబ్బుంది. నేను పేదవాడిని.. వాళ్ళలాగా ఏ మీడియా నాదగ్గర లేదు, ఆయనకి ఉన్నట్టుగా నాదగ్గర ఛానల్స్ లేవు.. నేను పేదవాడిని, మీలో ఒకడిని,పేద ప్రజల కోసం ఈ పేదవాడికి ఓటెయ్యండి, పేదల కోసం ఆలోచించే వాళ్లకు ఓటేస్తారా.. పెత్తందారులకు ఓట్లువేస్తారా అంటూ ఊదర గొట్టే జగన్ పై విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధ విరుచుకుపడ్డారు.
టీడీపీ నుంచి వంగవీటి రాధకి సీటు దక్కకపోయినా.. రాధ ప్రజల్లో తిరుగుతూ టీడీపీ తరపున ప్రచారం చెయ్యడమే కాదు.. నాకు డబ్బులు లేవు, నాకు మీడియా లేదు, నేను పేదవాడిని అని చెప్పుకునే జగన్.. నీ సాక్షి టీవీకి, పేపర్ కి ఎన్ని వేల కోట్లు దోచిపెట్టావో చెప్పు అంటూ నిలదీసాడు. జగన్ సాక్షి పేపర్ ద్వారా తన పార్టీని, తనని ఎంతెలా ప్రమోట్ చేసుకుంటున్నాడో అనేది అందరికి తెలుసు.
కానీ తానొక పేదవాడిని, తనకి చంద్రబాబు లాగ ఛానల్స్ లేవు, మీడియా లేదు అని చెప్పుకుంటూ తిరుగుతాడు, ప్రజలు గమనిస్తున్నారు జగన్ నిన్ను వదలరు.. ఈసారి ఓటమిని ఫేస్ చెయ్యడానికి రెడీగా ఉంటూ అంటూ వంగవీటి రాధా జగన్ ని ఓ ఆటఆడుకున్నాడు.