Advertisement
Google Ads BL

టిల్లు స్క్వేర్ ఓటీటీ డేట్ వస్తోంది


సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ టిల్లు స్క్వేర్ థియేటర్స్ లో విడుదలైన రెండు వారాల్లోనే 125 కోట్లు కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక కామెడీ ఎంటర్టైనర్ 100 కోట్లు దాటడమే చాలా గొప్ప అని అందరూ మాట్లాడుకున్నారు. నాగవంశీ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం మేకర్స్ కి లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు హీరో సిద్దు రేంజ్ మరింతగా పెంచేసింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అయితే ఈ చిత్రంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈచిత్రాన్ని తెలుగు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు. సిద్దు జొన్నలగడ్డ పెరఫార్మెన్స్, అతని కామెడీ టైమింగ్ తో పాటుగా, మ్యూజిక్, మల్లిక్ రామ్ దర్శకత్వం, అనుపమ కేరెక్టర్ అన్ని హైలెట్ అయిన  ఈచిత్ర డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ని థియేటర్స్ లో చూసినా.. మరోసారి ఓటీటీలో చూసేందుకు యూత్ తో పాటుగా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు.  

ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ అవ్వొచ్చని అంటున్నారు. మార్చి 29 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తేవొచ్చని.. ఈ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. 

Speculation on Tillu Square OTT date :

Tillu Square OTT date locked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs