నిన్నమొన్నటివరకు కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్ హీరోయిన్ నయనతార జోరు కాస్త తగ్గింది అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇదివరకలో నయనతార యంగ్ హీరోలు, స్టార్ హీరోల బిగ్ ప్రాజెక్ట్స్, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అంటూ చాలా బిజీగా కనిపించేది. కానీ ఇప్పడు నయనతార ఎక్కువగా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుంది.
అయితే ఈ సమయంలో నయనతారకి మరో హీరోయిన్ స్పాట్ పెట్టింది అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. త్రిష కొద్దిరోజులుగా స్టార్ హీరోల ఛాన్సెస్ అన్ని కొట్టేస్తుంది. మణి రత్నం ఆమెకిచ్చిన పొన్నియన్ సెల్వన్ బూస్ట్ తో ప్రస్తుతం త్రిష అజిత్, కమల్, విజయ్ అబ్బో కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వేగాన్ని పెంచేసింది. అటు చూస్తే నయనతార కెరీర్ డల్ అయ్యింది.
నయనతార షారుఖ్ సినిమా జవాన్ తో హిందీలోకి డెబ్యూ ఇచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఆ చిత్రం తర్వాత నయనతారకి హిందీ అవకాశాలు వస్తాయనుకుంటే.. అదీ లేదు. ప్రస్తుతం భర్త దర్శకుడిగా బిజీ అయితే కానీ మళ్ళీ తన సినిమాపై ఫోకస్ పెట్టేలా కనిపించడంలేదు. కానీ ఈలోపు త్రిష నయనతార ప్లేస్ ని ఆక్యుపై చేసేసింది. త్రిష నటిస్తున్న ఒక్క చిత్రం హిట్ అయినా ఆమె రేంజ్ మారిపోవడం ఖాయంగా కనబడుతుంది.
మరోపక్క త్రిష థగ్ లైఫ్ చిత్రానికి గాను అత్యధిక పారితోషికం అందుకుంటూ రెమ్యునరేషన్ పరంగా నయనతార ని దాటేసింది అనే టాక్ కూడా వినిపిస్తోంది.