సాయి పల్లవి నటి కాక ముందే సూపర్ డాన్సర్. కన్నడ నుంచి వచ్చిన ఈమె తెలుగులో ఈటీవీలో ప్రసరమైన ఢీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటూ తనకి పేరు తెచ్చే పాత్రల్లోనే కనిపిస్తుంది తప్ప పారితోషికానికి కానీ, స్టార్ హీరోల ఛాన్సెస్ కి కానీ, గ్లామర్ షోస్ కి కానీ పడిపోదు, ఓకె చెప్పదు.
ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రాజెక్ట్స్ లో బిజీగా వున్న సాయి పల్లవి గతంలో కాలేజ్ ఫెస్ట్ లో కత్రినా కైఫ్ కెరీర్ లోనే ద బెస్ట్ సాంగ్ గా నిలిచిన షీలా కి జవానీ సాంగ్ కి డాన్సు చేసి అదరగో అనిపించింది. కత్రినా కైఫ్ సన్నజాజి నడుముతో, కళ్ళు చెదిరే గ్లామర్ తో చేసిన షీలా కి జవానీ సాంగ్ డాన్స్ ఇప్పటికి ట్రెండింగే.
ఆ సాంగ్ కి సాయి పల్లవి తన కాలేజ్ రోజుల్లోనే కత్రినా కైఫ్ మాదిరి కాస్ట్యూమ్స్ ధరించి చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవి చేసిన డాన్స్ చూస్తే నిజంగా మతిపోతుంది. సింగిల్ టేక్ లో బ్రేక్ తీసుకోకుండా దున్నేసింది. ఆమెతో పాటుగా ఆమె ఫ్రెండ్స్ కూడా స్టెప్స్ తో ఇరగ్గొట్టేసారు.