పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ కాంబోలో త్వరలోనే పాన్ వరల్డ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి రిలీజ్ డేట్ అప్ డేట్ కోసం ప్రభాస్ తో పాటుగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మేకర్స్ కల్కి 2898 AD రిలీజ్ డేట్ విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఇప్పుడు కల్కి థియేట్రికల్ రైట్స్ విషయంలో ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
కేవలం తెలుగు స్టేట్స్ లోనే ప్రభాస్ కల్కి 190 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడం పట్ల ప్రభాస్ ఫాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
Nizam ₹75 Cr Advance
Ceded ₹30 Cr Advance
Andhra ₹80-90 Cr Advance Depending on Ticket Prices.
AP & TG Total around ₹190 Cr Full Recoverable Advance! అంటూ వస్తున్న కథనాలతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రభాస్ రేంజ్ కి కల్కి థియేట్రికల్ బిజినెస్ నిదర్శనం అంటున్నారు. కల్కి మీదున్న హైప్ కారణంగానే ఈ రేంజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కమల్ హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తుండగా.. అమితాబచ్చన్, దీపికా పదుకొనె , దిశా పటానీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈచిత్రం మే 9 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఎప్పటికి డేట్ ఫిక్స్ చేసుకుంటుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు కనిపిస్తున్నారు.