Advertisement
Google Ads BL

ఎలెక్సెన్స్ సర్వేలో వైసీపీదే హవా..


ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి.. ఈసారి ప్రజలు అధికారం ఎవరికి కట్టబెడతారు, సీఎం చైర్ పై ఎవరు కూర్చుంటారో అనే విషయంలో చాలా ఆసక్తి నడుస్తుంది. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ తో టీడీపీ-జనసేన-బిజెపి కూటమిగా ఏర్పడి ఫైట్ చేస్తున్నాయి. జగన్ సిద్దమేనా బస్సు యాత్రతో ప్రజల్లోకి వెలుతుండగా.. ఆయనకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. 

Advertisement
CJ Advs

మరోపక్క ఒక్కో సర్వే లో ఒకొక్కరికి మెజారిటీ వస్తుంది అన్నట్టుగా ఈసారి ఎలెక్సెన్స్ సర్వేలో వైసీపీ దే మరోసారి అధికారం అని తేల్చి చెప్పేసింది. తాజాగా ఏపీలో వచ్చేది మళ్లీ వైఎస్‌ జగనే అంటూ ఎలెక్సెన్స్ సర్వే లెక్కలు చెబుతుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు వారు 86,200 నమూనా పరిమాణాలని తీసుకుని ఏపీలో సర్వే చేయడం జరిగింది. 

ఆ సర్వేలో వైసిపి కి దాదాపుగా మెజారిటీ సీట్స్ వస్తాయని తేల్చి చెప్పింది. 127 సీట్లు (50.38%) వైసీపీ కి, టిడిపి, జనసేన, బిజెపి కూటమికి కలిపి 48 సీట్లు (45.58%), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 0 సీట్లు (1.38%), ఇతరులు 0 సీట్లు (2.66%) వస్తాయని ఎలెక్సెన్స్ సర్వే తేల్చింది. మొత్తంగా ఈ సర్వే ప్రకారం కూడా ఏపీలో మళ్ళి సీఎం జగన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తేల్చడంతో గెలుపు చాలావరకు వారివైపు ఉన్నట్లు స్పష్టం అవుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Jagan:

Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs