కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈమధ్యన సోషల్ మీడియాలో భర్త విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చెయ్యడంతో నయన్ కి విగ్నేష్ శివన్ కి మధ్యన విభేదాలొచ్చాయని, వీరు త్వరలోనే విడిపోతారంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అలా ప్రచారాలు జరుగుతున్న సమయంలోనే నయనతార తన పిల్లలు, భర్త విగ్నేష్ తో కలిసి జాలిగా ట్రిప్ కి వెళ్ళొచ్చింది. అప్పటితో ఆ రూమర్స్ కి అడ్డుకట్ట పడింది.
తాజాగా నయనతార తన కవల పిల్లలు, భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఓ క్యూట్ ఫోటోకి ఫోజులిచ్చింది. నిన్న ఆదివారం తమిళ ఉగాది. తమిళనాట కొత్త సంవత్సరాదిని సీలెబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంత భక్తితో సెలెబ్రేట్ చేసుకుంటారు. నయనతార కూడా తన పిల్లలతో కలిసి ఈ తమిళ ఉగాది గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది.
సాంప్రదాయ వస్త్రాల్లో నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్, పిల్లలు కనిపించారు. పిల్లలు ముద్దులొలుకుతూ క్యూట్ గా ఫొటోలకి ఫోజులివ్వగా.. నయనతార-విగ్నేష్ శివన్ లు చాలా బ్యూటిఫుల్ లుక్స్ తో మెస్మరైజ్ చేసారు. నయనతార క్యూట్ ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.