Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ ని బ్యూటీ అంటున్న రాశి ఖన్నా


నిన్న ఆదివారం తమిళ ఉగాది. అంటే తమిళనాడు కి కొత్త సవత్సరాది అన్నమాట. ఈ ఫెస్టివల్ రోజున సూర్య నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు కంగువ నుంచి కొత్త పోస్టర్ రాగా.. ధనుష్ రాయన్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. కోలీవుడ్ హీరోయిన్స్ తమిళ ఉగాదిని సెలెబ్రేట్ చేసుకుంటూ కొత్త కొత్త ఫొటోస్ ని వదిలారు. అందులో అనుపమ పరమేశ్వరన్ వైట్ శారీ లో ఉన్న అందమైన ఫొటోస్ ని షేర్ చేసింది. ప్రతి ఫెస్టివల్ కి అద్భుతమైన ఫోటో షూట్ తో దిగిపోయే కీర్తి సురేష్ కోసం ఆమె అభిమానులు చాలా వెయిట్ చేసారు. 

Advertisement
CJ Advs

అయితే కీర్తి సురేష్ గత రాత్రి తమిళ ఉగాదికి శుభాకాంక్షలు  తెలియజేస్తూ తన ఫెస్టివ్ లుక్ ని వదిలింది. ఎల్లో చుడిదార్ లో కీర్తి సురేష్ లుక్ సూపర్బ్ అనేలా ఉంది. ఆ ఫొటోస్ తో పాటుగా Wishing You and your Family a Happy Tamil New Year and Happy Vishu!❤️ అంటూ అందరికి అంటే ముఖ్యంగా అభిమానులకి తమిళ కొత్త సవత్సరాదికి శుభాకాంక్షలు తెలియజేసింది. 

కీర్తి సురేష్ ఫెస్టివల్ లుక్ ఫోటో చూసి మరో గ్లామర్ హీరోయిన్ రాశి ఖన్నా Beauty! ❤️అంటూ కామెంట్ చేసింది. కీర్తి సురేష్ తమిళ ఉగాది లుక్ లో మెరిసిపోయింది. ఎల్లో డ్రెస్ లో బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Rashi Khanna calls Keerthy Suresh a beauty:

Keerthy Suresh Celebrated Tamil New Year
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs