ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ఊరిస్తున్న కోలీవుడ్ హీరో విశాల్ ఫైనల్ గా డెసిషన్ తీసేసుకున్నాడు. 2024 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఏ పార్టీ నుంచో ఎమ్యెలేగా కాకుండా తానే పార్టీ పెట్టబోతున్నట్టుగా చెప్పి అందరికి షాకిచ్చాడు. ఇప్పటికే హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టాడు. ఇప్పుడు హీరో విశాల్ మరో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు.
విశాల్ గతంలో ఆంధ్ర లోని చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత దానిని విశాల్ ఖండించాడు. తాను రాజకీయాల్లోకి రావడం పక్కానే కానీ అది ఏపీ కాదు తమిళ రాజకీయాల్లోకి వస్తా అని స్పష్టం చేసాడు. తాజాగా విశాల్ తమిళనాట అసంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తాను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో విశాల్ ఓ వర్గం ప్రజలకి దగ్గరయ్యాడు. చెన్నై లో తుఫాను బీభత్సం సృష్టించినప్పుడు, ఇంకా ఇతర సమయాల్లో విశాల్ కొన్ని ఏరియా ప్రజలకి అండగా నిలిచాడు. అప్పట్లో విశాల్ ఇదంతా రాజకీయాల కోసమే చేస్తున్నాడు అన్నారు. ఇక ఇప్పుడు విశాల్ ఫైనల్ గా అతి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నా.. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా.. ప్రస్తుతం తమిళనాట ప్రజలకు సరైన వసతులు లేవు. వాళ్లకు సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది నా కోరిక, ప్రజల కోసమే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా అంటూ విశాల్ ప్రకటించాడు.