పవన్ కళ్యాణ్ నిన్న ఆదివారం సాయంత్రం తెనాలి సభ సాక్షిగా జగన్ పై విరుచుకుపడ్డారు. ఆంధ్రలో ఎన్నో అరాచకాలు జరిగాయి.15 ఏళ్ల అమర్నాథ్ ని కాల్చేస్తే, 30 వేల ఆడబిడ్డలు కనిపించకపోతే రాష్ట్రానికి గాయం అవ్వలేదా, అపుడు హడావిడి ఉండదు. జగన్ కి దెబ్బతగిలింది, బొక్క పడింది అంటూ నానా హంగామా చేస్తారు. రాష్ట్రలో పసి బిడ్డల ప్రాణాలకు సేఫ్టీ లేదు అంటూ జగన్ ప్రభుత్వం పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అంతేకాకుండా తన అన్న మెగాస్టార్ చిరంజీవి తమ పార్టీ కోసం ఐదు కోట్లు విరాళం ఇస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నేను ఆశించలా, అసలు ఊహించాలా అన్నయ్య ఎలక్షన్స్ సమయంలో జనసేన పార్టీకి అవసరం అవుతాయని 5 కోట్లు విరాళం ఇచ్చాడు. అంతేకాకుండా రామ్ చరణ్‌కు కూడా విరాళం ఇవ్వమని చెప్పాడు.. తెనాలి సభ నుండి చిరంజీవి గారికి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు.
చిరు వారం క్రితం విశ్వంభర సెట్స్ లో పవన్ కళ్యాణ్ ని పిలిచి జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇచ్చారు. మరి రామ్ చరణ్ ఎన్ని కోట్లు బాబాయ్ పార్టీ కోసం విరాళము ఇస్తాడో అనే ఆత్రుత మెగా ఫ్యాన్స్ లో మొదలైంది. ఇక వీరంతా ఫండ్స్ తోనే సరిపెడతారా లేదంటే గ్రౌండ్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తారా అనేది కూడా ఇప్పుడు అందరిలో మొదలైన ఆసక్తి.