Advertisement
Google Ads BL

సైలెంట్ గా చొచ్చుకుపోతున్న ఎన్టీఆర్


ఇప్పటివరకు ముంబైలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ల హడావిడి చూసిన ఎన్టీఆర్ ఫాన్స్.. ఎప్పుడు తమ హీరో ఇలా ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూసారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు కేబినెట్ మినిస్టర్స్ ని కలవడం, బర్త్ డే పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీస్ ని పిలవడం, అటు అల్లు అర్జున్ తరచూ ముంబై మీడియాలో కనిపించడం, అక్కడి దర్శకులని మీటవ్వడం ఇలా చేస్తూ వారు హైలెట్ అవడంతో ఎన్టీఆర్ అభిమానులు బెంగపెట్టేసుకున్నారు. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మెల్లగా ముంబైలో పాగా వెయ్యబోతున్నాడు. వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై లో అడుగుపెట్టాడు. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్న ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హిందీలోకి గ్రాండ్ గా లంచ్ అవుతున్నాడు. ముంబై వెళ్ళగానే ఎన్టీఆర్ కి అక్కడ అపూర్వ స్వాగతం పలికారు. దానితో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో ఆయన ఫాన్స్ భీభత్సమైన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 

ఎన్టీఆర్ ఫాన్స్ మా హీరో మెల్లగా ముంబై లో చొచ్చుకుపోతున్నాడు అని సంబరపడుతున్నారు. రెండేళ్లుగా ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. వార్ 2 పది రోజుల షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన విషయం తెలిసిందే, మరి ఈ పది రోజుల్లో ఎన్టీఆర్ పై ఇంకెన్ని స్పెషల్స్ వింటామో అని ఎన్టీఆర్ ఫాన్స్ ఆత్రంగా ఉన్నారు. 

NTR is penetrating silently:

Jr NTR participates in Iftar party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs