Advertisement
Google Ads BL

పవన్ పరువు తీస్తున్న నాగబాబు!


జనసేన పరువు కాపాడాలని.. ఈసారైనా గెలిచి తన, పార్టీ ప్రిస్టేజ్ నిలుపుకోవాలని అధినేత పవన్ కళ్యాణ్ అహర్నిశలు శ్రమిస్తుంటే.. ఆయన సోదరుడు నాగబాబు మాత్రం పరువు గంగలో కలపడానికి నిద్ర లేకుండా కష్టపడుతున్నారు!. ప్రతి విషయంలోనూ తలదూర్చి రచ్చ రచ్చే చేస్తున్నారు మెగా బ్రదర్.!ఒక్క మాటలో చెప్పాలంటే నాగబాబు కాస్త ఆగంబాబులా తయారయ్యారని సొంత పార్టీ నేతలే తిట్టి పోస్తున్న పరిస్థితి.

Advertisement
CJ Advs

టూ మచ్ బాబు!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడ వేదికగా హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా తప్పుబట్టారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తప్పుబట్టిన పరిస్థితి. ఐతే టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో మాత్రం విషం కక్కింది. ఇక జనసేన తరపున నాగబాబు స్పందించారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్.. అస్సలు స్క్రిప్ట్ లాగా అనిపించట్లేదు అని ట్విట్టర్ పేజీలో రాసుకొచ్చారు.ఈ ట్వీట్ వెనక అర్థం ఏంటో అని అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు రాళ్ల దాడి నాటకమో, బూటకమో, నిజమో, అబద్ధమో ఇక వైసీపీ నేతలే తేల్చాలని జనసేన ఓ వీడియోను షేర్ చేసింది. చూసారా నాగబాబు ఎంత విషం కక్కారో అర్థం అయ్యింది కదా! అయితే ఏమైందో ఏమో అంతలోనే నాగబాబు ఆ ట్వీట్ ని డిలేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. 

ఆడుకుంటున్నారు!

ఈ ట్వీట్ పై వైసీపీ శ్రేణులు.. జనసేన కార్యకర్తలు దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది మతి ఉండే మాట్లాడుతున్నావా..? తమరిని రియాక్ట్ అవ్వమని చెప్పినదేవరు..? మెగా ఫ్యామిలీలో ఒక్కడిగా ఎలా అయ్యావ్ సామి..? పార్టీతో పాటు మెగా ఫ్యామిలీ.. ముఖ్యంగా పవన్ పరువు తీశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు, అభిమానుల కామెంట్స్ చూస్తే అబ్బో ఆ మాటలు.. చెవులతో వినలెం.. నోటితో చదవలేం.. అలా ఉన్నాయ్. ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఐతే ఛీ.. చీ అనేలా తిట్టేస్తున్నారు. ఏదేమైనా నాగబాబు ఇలా కామెంట్స్ చేయడం అచ్చు తప్పు.. ఇలాంటి సమయంలో సపోర్టుగా నిలవాలే తప్ప.. ఇలా సిల్లీగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అనేది నాగబాబుకే తెలియాలి మరి.

Pawan is taking pride in Nagababu!:

 Nagababu Cheap Tweet Against Attack On CM Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs