Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కూడా హామీ ఇచ్చేసాడు


ఇప్పుడు గేమ్ ఛేంజర్ డేట్ పై రామ్ చరణ్ కూడా హామీ ఇచ్చేసాడు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు ఇంతకు ముందే అంటే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ సమయంలోనే గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం ఓ నాలుగైదు నెలలు ఓపిక పట్టండి అంటూ మెగా ఫాన్స్ ని కూల్ చేసారు. అసలే మెగా ఫాన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

గేమ్ ఛేంజర్ మూవీ మొదలై మూడేళ్లు కావొస్తున్నా.. ఇప్పటివరకు షూటింగ్ అప్ డేట్ కానీ, సినిమా విడుదల తేదీ కానీ ఇవ్వకుండా మెగా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇక దర్శకుడు శంకర్ మరో మూవీ ఇండియన్ 2 ని జూన్ లో విడుదల చేస్తున్నామని ప్రకటించగానే అందరిలో గేమ్ ఛేంజర్ విడుదలపై ఆశ మొదలైంది. 

అయితే రామ్ చరణ్ నిన్న శనివారం చెన్నైలో డాక్టరేట్ అందుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తాను నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై చిన్నపాటి స్పెషల్ అప్ డేట్ ఇచ్చాడు. గేమ్ ఛేంజర్ ని సెప్టెంబర్ లో కానీ, అక్టోబర్ లో కానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామంటూ చెప్పడంతో మెగా ఫాన్స్ కూడా సర్ ప్రైజ్ అవడమే కాదు.. చరణ్ ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇప్పుడు వారు బలంగా నమ్ముతున్నారు. 

Ram Charan reveals the release plans of Game Changer:

Ram Charan drops an update about his film Game Change
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs