2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్ పై ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో దాడి చేసిన విషయం ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో.. ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయి విసిరిన ఘటన అంతే సెన్సేషన్ అవ్వుద్ది అని వైసీపీ నేతలు అనుకున్నారు. నిన్న శనివారం రాత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రజలకి అభివాదం చేస్తున్న సమయంలో జగన్ పై రాయి విసరగా అది కంటి పై భాగానికి తగిలిన విషయం తెలిసిందే.
అయితే జగన్ పై చంద్రబాబు దాడి చేయించాడంటూ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు సింపతీ క్రియేట్ చేద్దామనుకుంటే అది కాస్తా కామెడీ అయ్యింది. ఆ దాడి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పది మంది వైద్యుల నడుమ ఆయన గాయానికి కుట్లు వేయించుకున్న జగన్.. జగన్ ఈరోజు విశ్రాంతిలోకి వెళ్లిపోయారు. ఇక జగన్ పై రాయి దాడి విషయంలో సోషల్ మీడియాలో వైసీపీ నేతలు ఇది ప్రతిపక్షాల కుట్ర అంటుంటే.. కాదు ఇది జగన్ కావాలని చేయించుకున్న దాడే అంటున్నారు.. ఇక సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే..
చిన్న ప్లాస్టర్ లేకపోతే చిన్న కుట్టు వెయ్యటానికి ఇంత మంది మెడికల్ స్టాఫ్ ఏంట్రా బాబు, ఏదో మేజర్ సర్జరీ చేసినట్టు. చిన్నప్పుడు వూర్లో రోజుకో, ఇలాంటి దెబ్బ తగిలేది, తుడుచుకొని పొయ్యేవాళ్ళము.. అంటూ కామెడీగా మాట్లాడుతున్నారు.
ఇక టీడీపీ నేతలైతే..
• దాడి జరిగిన క్షణం నుంచే జగన్ పై హత్యాయత్నం అంటూ చంద్రబాబు పై టార్గెట్ గా వైసీపీ దాడి
• చంద్రబాబు కుట్ర అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తించేలా విమర్శలు
• వైసీపీ ప్రచారానికి విరుద్ధంగా ప్రజలు, సోషల్ మీడియాలో ప్రతి స్పందన.
• ఇదంతా వైసీపీ డ్రామా అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు
• కోడికత్తి డ్రామా 2, నాడు కోడికత్తి నేడు రాయి నెత్తి అంటూ వేలాదిగా పోస్టులు
• సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నాడు మంత్రులు చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలు
• నాడు ప్రతిపక్ష నేత బస్సుపై రాళ్ల దాడి సమయంలో అదొక నాటకం అంటూ వైసీపీ ముఖ్యనేతల వ్యాఖ్యలు
• ప్రజా వ్యతిరేక ఉండడం వల్లనే ఇలాంటి రాళ్లు పడతాయి అని నాడు స్వయంగా వ్యాఖ్యానించి మంత్రులు
• కరెంట్ ఎందుకు తీశారు, భద్రత చూడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు అంటూ తటస్థుల నుంచీ విమర్శలు
• 2014 నుంచి నేటి వరకు జగన్ ప్రతి ఎన్నికల ముందు ఇక డ్రామా అడుతారు...దాన్ని ప్రతిపక్షంపై నెడతారు అంటూ సోషల్ మీడియాలో సీక్వెన్స్ పై పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్ అంటూ టీడీపీ నేతలు జగన్ ని ఆడేసుకుంటున్నారు.