Advertisement
Google Ads BL

అయ్యో చంద్రబాబు..ఈ పరిస్థితి వచ్చిందేంటి!!


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. మూడుసార్లు ముఖ్యమంత్రి.. దేశంలో అత్యంత సీనియర్ నేనే.. ఎవరైనా నా తర్వాతే..! దేశ ప్రధానులను, రాష్ట్రపతులను కూడా నేనే నిర్ణయించా..! ఇదీ ఎప్పుడు చూసినా.. ఎక్కడ విన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నోట వచ్చే మాటలు. ఇన్ని చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ సభ పెట్టినా.. మీడియా ముందుకొచ్చినా మాటకు ముందు.. ఆ తర్వాత వలంటీర్లు.. వలంటీర్లు అనే వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వలంటీర్లను ఏ రేంజులో కాకా పడుతున్నారంటే ఒకప్పుడు అదే నోటితో ఇష్టమొచ్చినట్లు తిట్టి.. ఇప్పుడు అదే నోటితో మెచ్చి, ఆకాశానికి ఎత్తుతున్న పరిస్థితి. 

Advertisement
CJ Advs

ఏం జరుగుతోంది బాబూ!!

వలంటీర్లు.. ఏం జాబండి అదీ.. గోనే సంచులు మోసే ఉద్యోగం.. ఇంటి ఇంటికి వెళ్లి మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతారా..? అని బాబు హేళన చేసిన సందర్భాలు కోకొల్లలు. ఒక్క బాబే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, టెర్రరిస్టులతో పోల్చారు. సీన్ కట్ చేస్తే.. కరోనా.. భారీ వర్షాల టైములో బాబు అడ్రెస్స్ లేకుండా హైదరాబాద్ లో కూర్చుంటే ప్రాణాలు తెగించి.. మరీ సేవలు చేసిన ఘనత వారిది. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. వలంటీర్లును ఎంతలా తిట్టి పోశారో.. ఇప్పుడు అహా.. ఓహో.. వలంటీర్లు అంటూ తెగ మెచ్చుకుంటున్న పరిస్థితి. 

ఇంత కాకా పడుతున్నారో..!

వలంటీర్లు వ్యవస్థ అంటేనే వరస్ట్.. అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యవస్థకు సలాం కొట్టి.. వారిని కాకా పడుతున్న పరిస్థితి. ఆఖరికి తాను అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తానే తప్ప అస్సలు తీయను అని చెబుతున్నారు. అంతే కాదు ఇప్పుడు వారికీ ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారని.. తాను అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తానని కూడా ఉగాది రోజు చెప్పిన పరిస్థితి. వాస్తవానికి వలంటీర్లు ఎంత ప్రజాసేవ చేస్తున్నారో.. వైసీపీకి అంతకు మించి సేవ చేస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యమే. అందుకే ఈ లొసుగులు అన్నీ తెలిసిన బాబు.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు వందల సార్లు వలంటీర్లు.. వలంటీర్లు అని పలుకుతున్నారు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. 

ఇదెలా బాబు..!

చూశారుగా.. ఇంత చేస్తున్నప్పటికీ వలంటీర్ల విషయంలో బాబును జనాలు నమ్మటం లేదు. ఎందుకంటే పెన్షన్లు విషయంలో వృద్దులు, వితంతువులు, వికలాంగులు బాబును తిట్టి పోశారు. ఐతే మరోవైపు జగన్ అంతా తప్పు చేశారని పని కట్టుకొని ఇలా పెన్షన్లు ఆపారని కూడా టాక్ నడిచింది. ఏదేమైనా బాబు మాత్రం ఎక్కడి నుంచి ఇక్కడికి దిగి వలంటీర్లను పొగుడుతున్నారు.. మరి అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల కథేంటి..? ఇది టీడీపీకి ఎంత ప్రతిష్టాత్మకం అనేది అందరికీ తెలుసు.. అలాంటిది వలంటీర్ల వ్యవస్థ ఎందుకు..? కొనసాగిస్తారు అనేది.. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Oh Chandrababu..what happened to this situation!!:

What is going on Chandrababu!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs