సామాన్యుడు కాదు.. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిందంటే మామూలు విషయం కాదు..! ఇంతకీ ఈ ఘటనకు పాల్పడింది ఎవరు..? దీని వెనుక ఎవరున్నారు..? ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది..? ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు స్పందించిన తీరెంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..!!
అటు హ్యాపీ.. ఇటు బాధ..!!
ఉదయం నుంచి ఒక్కటే హడావుడి.. తమ అభిమాన నేత విజయవాడ విచ్చేస్తున్నారని ఎంతో సంతోషంతో కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు.. అని భారీగానే జన సమీకరణ చేశారు నేతలు. అనుకున్నట్లే మునుపెన్నడూ లేని విధంగా.. ఏ నేతకూ దక్కని ఆదరణ దక్కింది. వారధిపై జనసంద్రం.. ఆ హారతులు పట్టిన తీరు చూసిన వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతలోనే ఊహించని రీతిలో జగన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గల్లి నుంచి ఢిల్లీ వరకూ ఉలిక్కి పడింది. చిన్నపాటి లీడర్ మొదలుకుని ప్రధాని మోడీ వరకూ ట్వీట్స్.. తీవ్రంగా ఈ దాడిని ఖండించారు.
ఎవరు.. ఎవరున్నారు..?
ఈ దాడి చేసింది ఎవరు..? టీడీపీనే చేసిందని వైసీపీ.. లేదు లేదు మాకు ఎలాంటి సంబంధం లేదు.. అని టీడీపీ చెబుతోంది. పైగా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న వార్ నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆ వివేకానంద స్కూలు రెండో అంతస్తులో నిన్న సాయంత్రం నుంచి.. రాత్రి వరకూ ఏం జరిగింది..? రాత్రి పూట స్కూలులో అగంతకులకు ఏం పని..? ఇంత రెక్కీ చేసిందెవరు..? సీసీ కెమెరాలు ఏమయ్యాయి..? సీసీ పుటేజీని పోలీసులు ఎందుకు పరిశీలించలేదు..? అనేది ప్రశ్నార్థకం. ఘటన వెనుక ఎవరున్నారో పైనున్న పెరుమాల్లకే ఎరుక.
ఏం జరుగుతోంది..?
జగన్ రెడ్డికి ఉన్న భద్రతా సిబ్బంది ఏమైంది..? అనంతపురం జిల్లాలో చెప్పు దాడి జరిగినప్పుడు ఎందుకు అలెర్ట్ కాలేదు..? నాదే సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు..? పోనీ సెక్యూరిటీలో మార్పులు ఎందుకు చేయలేదు..? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దాడి తర్వాత అధికారుల అత్యవసర సమీక్ష చేస్తే ఏం ఫలితం..? సీఎం జగన్ సెక్యూరిటీలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దాడి సమయంలో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం.
ఈసీ సీరియస్!
సీఎం జగన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. విజయవాడ సీపీ కాంతి రాణాను సీఈఓ ఎంకే మీనా నివేదిక కోరారు. సీపీ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్న సీఈఓ.. ఏపీలో జీరో వయలెన్స్ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపింది. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్ అయ్యింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీపీ కాంతి రాణా.. ఇవాళ సాయంత్రం లోపు నివేదికను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. నివేదికలో ఏముంటుందో చూడాలి మరి.