పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD చిత్రం మే 9 న విడుదలవుతుందా అనే మీమాంశలో ప్రభాస్ అభిమానులు అల్లాడుతున్నారు. మే 13 న ఎలక్షన్స్ మూమెంట్ లో ఇండియా మొత్తం ఆ ఎలక్షన్స్ ఫీవర్ లో ఉంటే కల్కిని పట్టించుకోరు, అందుకే మేకర్స్ కల్కిని పోస్ట్ పోన్ చెయ్యాల్సిందే అంటుంటే.. మరోపక్క కల్కి ట్రైలర్ చూసి ప్రభాస్ ఇంకా కల్కి టీమ్ ఎంజాయ్ చేసినట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే మే 9 నుంచి పోస్ట్ పోన్ అయ్యి కల్కి 2898 మే 30 న విడుదల అంటున్నారు. కాదు జూన్ కానీ జులై కానీ కల్కి రిలీజ్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతున్నా కల్కి మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఏ తేదికి అయితే వరల్డ్ వైడ్ గా వర్కౌట్ అవుతుందా అని మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అసలు ప్రభాస్ కల్కి మే లోనే వస్తుందా? లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా జూన్ లో వస్తుందా, జూన్ లో ఇండియన్ 2 ఉంది. జూన్ 15 న ఇండియన్2 రాబోతుంది. మరి కల్కి కి ఏ డేట్ లాక్ చేస్తే బావుంటుంది, జూన్ లో సెలవలు పూర్తయ్యి పిల్లలకి స్కూల్స్, కాలేజెస్ తీస్తారు. అప్పుడు భారీ బడ్జెట్ మూవీని రిలీజ్ చేస్తే బడ్జెట్ పరంగా వర్కౌట్ అవుతుందా నుండి కూడా మేకర్స్ ఆలోచనలో భాగంగా ఉందట. మరి కల్కి ఎప్పుడు, ఏ తేదికి వస్తుందో అర్ధం కాక ప్రభాస్ ఫాన్స్ తల పట్టుకుంటున్నారు.