పుష్ప పాన్ ఇండియా ఫిలిం బ్లాక్ బస్టర్, ఆ తర్వాత హిందీలో యానిమల్ హిట్ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కన్నడ నుంచి మెల్లగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక సోషల్ మీడియాలోనూ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలనే కాదు.. ప్రొఫషనల్ విషయాలతో అభిమానులకి చేరువలో ఉంటుంది.
ఇక తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను విజయాలను, ట్రోల్స్ ని అసలు పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది. తనకన్నా ప్రపంచంలో చాలామంది అందమైన, తెలివైన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు నటనలోనే కాదు, చాలా విషయాల్లో ప్రతిభావంతులు. మనల్ని మనం నిరూపించుకునే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. ఆ కొద్దిమందిలో నేను ఒకదాన్ని. నన్ను నా ప్రతిభని గుర్తించిన దర్శకనిర్మాతలకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి.
కెరీర్ లో గెలుపోటములు పట్టించుకోకూడదు. అది ఏ రంగమైనా జయాపజయాలు కామన్. అది ఈ మధ్యనే తెలుసుకున్నాను. సెలెబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ప్రేక్షకులు మనగురించి ప్రతి విషయాన్ని గమనిస్తారు, పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. పొగడ్తలకి పడిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు, అందుకే నేను వీటిని పట్టించుకోవడం మానేసాను అంటూ రష్మిక ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.