మృణాల్ ఠాకూర్ సక్సెస్ కి ఫ్యామిలీ స్టార్ బ్రేకులు వేసింది. సీత రామంలో సీతగా, హాయ్ నాన్న లో యష్ణ గా ప్రేక్షక హృదయాలను దోచేసిన మృణాల్ ఠాకూర్ కి ఫ్యామిలీ స్టార్ ఇందు పాత్ర షాకిచ్చింది. ఎప్పుడూ అందమైన, ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపించడమేనా.. మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించవా అనే విమర్శలు మొదలయ్యాయి.
అదలావుంటే మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ భేటీలో పాల్గొంది. అందులో ఆమె తన మొదటి చిత్రం సీతారామం లోని సీత పాత్ర గురించి మాట్లాడింది. నాకు ఫ్రెండ్ అయినా, నన్ను నడిపించిన మార్గదర్శి అయినా నటుడు దుల్కర్ సల్మాన్ అని, అతను నాకు బెస్ట్ కో స్టార్ అని చెప్పిన మృణాల్ ఠాకూర్ ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతున్నప్పుడు గుండె బద్దలైనట్టుగా అనిపిస్తుంది. పాత్రని ఇష్టపడి చేస్తే.. పూర్తిగా ఆ పాత్రలోకి మారిపోతాను.
అలా నేను ఇష్టపడి నటించేందే.. సీతారామంలో సీత పాత్ర. ఆ పాత్ర నుంచి బయటికి రావడానికి చాలా కాలమే పట్టింది.. అంటూ ఆమె సీత పాత్ర గురించి చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కి గ్లామర్ రోల్స్ చెయ్యాలని ఉన్నా.. ఆమెని తెలుగు దర్శకులు మాత్రం సీతారామంలో సీత పాత్రలోనే చూస్తున్నారు తప్ప కొత్తగా చూడక పోవడం ఆమెకి మైనస్ గా మారింది.