నందమూరి బాలకృష్ణ ని ఎవరైనా విసిగిస్తే ఆయనకి పిచ్చ కోపమొచ్చేస్తుంది. తనని చూసి ఎవ్వరైన నవ్వినా బాలయ్య కోపంతో ఊగిపోతారని ఓ డైరెక్టర్ ఈమధ్యనే బయటపెట్టాడు. ఇక బాలయ్యని విసిగించిన అభిమానులపై ఆయన చేయి చేసుకోవడం అనేది చాలా రొటీన్ గానే కనిపిస్తుంది. సెల్ఫీలు, ఫోటొస్ ఇలా విసిగిస్తేనే కోపం నషాలానికంటుతుంది.
బాలకృష ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా కనబడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఆయన సైకిల్ యాత్ర చేపట్టడానికి రెడీ అయ్యారు. కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు, చేయి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
బాలకృష్ణ హెలికాప్టర్ నుంచి దిగగానే అక్కడికి ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సమయంలో ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ దిగేందుకు అత్యుత్సాహం చూపించగా.. కోపమొచ్చిన బాలయ్య అతన్ని తోసేస్తూ చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దానితో.. అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ. సెల్ఫీ దిగేందుకు యత్నించిన అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ.. అంటూ వైసీపీ నేతలు, యాంటీ ఫాన్స్ బాలయ్య న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఆ వీడియో కింద..
ఆయన గురించి తెలిసి కూడా సెల్ఫీ కోసం సింహం దగ్గరికి వెళ్లాడంటే సాహసం అనే చెప్పాలి
సింహాతో సెల్ఫీ ఏంటయ్యా
బాలయ్య కొట్టకపోతే న్యూస్ కానీ కొడితే న్యూస్ ఏంటి ? అంటూ అయన అభిమానులు కామెంట్ చేస్తుంటే..
అసలు బాలయ్యకి ఎందుకింత పొగరు, ఎందుకింత అహంకారం అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు.