Advertisement
Google Ads BL

ఢీ షోలో జానీ మాస్టర్ పై అలిగేషన్


ఢీ సెలెబ్రిటీ సీజన్ లో జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లతో పాటుగా మాజీ హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా జెడ్జెస్ గా వస్తున్నారు. ఈ సీజన్ మొదలైనప్పుడు శేఖర్ మాస్టర్, ప్రణీత మాత్రమే జెడ్జెస్ గా ఉండేవారు. ఇప్పుడు జానీ, గణేష్ లు వస్తున్నారు. అయితే వచ్చే బుధవారం ఎపిసోడ్ లో జానీ మాస్టర్ ఢీ స్టేజ్ పై ఇద్దరు కంటెస్టెంట్స్ పై కోప్పడుతూ ఢీ షో నుంచి వెళ్ళిపోయిన ప్రోమోని వదిలారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement
CJ Advs

జానీ మాస్టర్ కి ఎందుకంతగా కోపం వచ్చిందో అంటూ మాట్లాడుకున్నారు. అయితే సాకేత్ - సునంద లు ఇద్దరూ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నప్పుడు కొంతమంది సాకేత్ కి సపోర్ట్ చేస్తే మరికొందరి సునందకు ఓటేశారు. అయితే ఈ ప్రాసెస్ లో ఓ కంటెస్టెంట్ తాను సాకేత్ కి ఓటు వెయ్యలేను అని, తాను ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు.. నేను ఓటింగ్ అనుకున్నప్పుడు అన్న (జానీ మాస్టర్) వైపు చూసినప్పుడు అక్కకి(సునంద) ఓటెయ్యమని కాంటాక్ట్ ఇచ్చారు అందుకే వేసాను అంటూ జానీ మాస్టర్ పై అలిగేషన్ చేసాడు. దానితో యాంకర్ నందు ఏం జరుగుతుంది మాస్టర్ ఇక్కడ అనగానే నేనేందుకు కూర్చోవాలి ఇక్కడ అంటూ జానీ మాస్టర్ కోపంగా లేచి వెళ్లిపోయారు. 

అరె నరేష్ నేను చెప్పానని ఓటేశాడంట, ఒక్క లైఫ్ లైన్ అది పొతే మాములుగా ఉండదు, ఢీ అంటే ఆటలుగా అనిపిస్తుందా మీకు, , చెప్పారా ఢీ ఎలా కనబడుతుంది చెప్పారా అంటూ కోపంగా మైక్ విసిరేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరి జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉండబోతున్నాయో, అసలు నిజం ఏమిటో అనేది పూర్తి ఎపిపోడ్ లో చూస్తే కానీ తెలియదు. 

Johnny Master angry with Dhee contestant :

Johnny Master angry with Dhee contestant Naresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs