కొద్దిరోజులుగా YS రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ కొడుకు జగన్ వైపు నిలుస్తారా? లేదంటే షర్మిల వైపు నిలుస్తారా? అనే ఆతృతలో వైసీ కార్యకర్తలు, నేతలు, కాంగ్రెస్ నాయకులూ చాలామంది ఎదురు చూస్తున్నారు. కారణం విజయమ్మ కొడుకు జగన్ వైసీపీ పార్టీలో ఉంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడం. విజయమ్మ జగన్ కి సపోర్ట్ చేస్తారా, లేదంటే షర్మిలకు చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణాలో షర్మిల వైపు నిలబడిన విజయమ్మ ఏపీలో జగన్ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ ఉంది.
రాజకీయాల్లో జగన్ కి న్యాయం చేస్తారా.. లేదంటే షర్మిల కూతురు కదా అని ఆమెకి న్యాయం చేస్తారా.. అసలు ఒకరికి న్యాయం చేస్తే మరొకరి అన్యాయం చేసినట్టే కదా.. అందుకే అందరిలో ఇంత ఆత్రుత. అసలు విజయమ్మ పయనం ఎటువైపో తేలడం లేదు. తాజా సమాచారం ప్రకారం విజయమ్మ కొడుకు జగన్ కి, కూతురు షర్మిల ఇద్దరికి సమన్యాయం చేయబోతున్నారని తెలుస్తోంది.
అంటే ఇద్దరి పక్షాన ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చెయ్యకుండా విజయమ్మ విదేశాలకి వెళ్ళిపోతున్నారట. ఎలక్షన్స్ సందడి సద్దుమణిగేవరకు విజయమ్మ ఇక్కడికి రాకుండా విదేశాల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి విజయమ్మ నిజంగా ఎలక్షన్స్ కి దూరంగా ఉండడమంటే జగన్ కి, షర్మిలకి సమన్యాయం చేసినట్టే కదా..!