Advertisement

ఒక్కడి కోసం లెక్కలేనన్ని వ్యూహాలు!


వన్  కోసం లెక్కలేనన్ని వ్యూహాలు!

Advertisement

ఒకే ఒక్కడు.. వ్యూహాలు మాత్రం ఊహకందనివి..! ఎట్టి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలవకూడదు.. ఇదే వైసీపీ ముందున్న మెయిన్ టార్గెట్.! ఇదేం 2019 కాదు.. 2024 అనే విషయం మరిచిపోవద్దు.. ఎన్ని వ్యూహాలు, కుట్రలు.. కుతంత్రాలు చేసినా సరే గెలిచి తీరుతానని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించి.. వైఎస్ జగన్‌  రెడ్డిని ఇంటికి పంపిస్తానని శపథం చేసి కూర్చున్నారు జనసేనాని..! అటు రీల్‌లో (సినిమాల్లో).. ఇటు రియల్‌‌గా హీరో అన్న విషయం వైసీపీకి బాగా అర్థమైపోయినట్టుంది. అందుకే.. ఈసారి కూడా పవన్ ఘోరంగా ఓడించి అసెంబ్లీ కాదు కదా.. గేటు కూడా తాకనివ్వకూడదని గట్టిగానే ప్లాన్ చేసింది అధికార పార్టీ. వైసీపీ ఇంతలా ఎందుకు పవన్‌పై పగ పట్టింది..? పిఠాపురం వేదికగా వైసీపీ చేస్తున్న కుట్రలు.. కుతంత్రాలేంటి..? అసలు సేనాని అసెంబ్లీలో అడుగుపెడితే వైసీపీకి వచ్చిన నష్టమేంటి..? అనే సంచలన విషయాలు తెలుసుకుందాం రండి..!

చూశారా ఫీల్డింగ్!

పిఠాపురంలో పవన్ గెలిచి అసెంబ్లీకి రాకూడదు అంతే.. ఇందుకోసం ఏం చేయడానికైనా సరే వెనుకాడట్లేదు వైసీపీ. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సీనియర్లు, కీలక నేతలు, కాపు నేతలను ఫీల్డ్‌లోకి దింపేశారు. ఒక్కో మండలానికి ఒక్కొక్కరు చొప్పున కేటాయింపులు చేసేశారు జగన్. నియోజకవర్గంలో ఉన్న కీలక మండలాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, కడప జిల్లా నుంచి వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. వంగా గీతలను ఇంచార్జీలుగా వైసీపీ హైకమాండ్ నియమించింది. వీళ్లంతా ఫీల్డర్స్ అయితే.. పవన్ ఒక్కడే బ్యాట్స్‌మెన్ అన్నమాట. ఇంత ఫర్‌ఫెక్ట్‌గా ఫీల్డింగ్ చేశాక.. పవన్ ఇక ఊపిరి పీల్చుకోలేరన్నది వైసీపీ భావన. అయినా సరే తగ్గేదేలే.. సింహం సింగిల్‌గానే వస్తుందని పవన్‌ గానే వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కాపు ఓటర్లు సుమారు లక్ష దాకా ఉండటంతో.. వీరే గెలుపోటములను డిసైడ్  చేయబోతున్నారు. అందుకే ముద్రగడను ఏరికోరి మరీ తెచ్చుకుంది వైసీపీ.

ఇవన్నీ కాదని..!

ఇంత పర్‌ఫెక్ట్‌గా అన్నీ సెట్ చేసినప్పటికీ పవన్ ఎక్కడ గెలిచేస్తారో అని భయం మాత్రం వైసీపీని వెంటాడుతూనే ఉంది. అందుకే లేనిపోని కుట్రలకు తెరలేపింది. సేనానిపై.. ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రిని బరిలోకి దింపింది. వాస్తవానికి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలనుకున్న ఆమె.. ఆఖరికి బీసీవై (భారత చైతన్య యువన పార్టీ) తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇదివరకూ జనసేనలో ఉన్న తమన్నా.. టికెట్ ఆశించి రాకపోవడంతో ఇటు జంప్ అయ్యి..  పవన్‌పైనే పోటీ చేయడానికి సిద్ధమైందంటే  ఏ రేంజ్‌లో ఆమెను బ్రెయిన్ వాష్ చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పవన్ పార్టీ సింబల్, పవన్ పేరుతో ఉన్న వ్యక్తిని బరిలోకి దింపడం మరో ఎత్తు. జనసేన గుర్తు గాజు గ్లాస్ ఉండటంతో దాన్ని పోలిన బకెట్ గుర్తుతో ప్రత్యర్థి బరిలోకి దింపడం గమనార్హం. ఇక నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనుమూరి పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని కూడా పిఠాపురం నుంచి పోటీలోకి దింపుతున్నారంటే.. వైసీపీకి ఎంతకు దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు. అదేదో అంటారే.. వైసీపీ నీచానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఒకవేళ నామినేషన్ విత్ డ్రా అనేది జరగకుంటే.. గాజు గ్లాస్, బకెట్ గుర్తులతో జనాలు బాగా కన్ఫూజ్ అయ్యే అవకాశాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి.

పవన్‌పైనే ఎందుకు..?

అసలు పవన్‌పై ఎందుకింతలా వైసీపీ పగబట్టింది..? ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు పోటీచేస్తున్న కుప్పంను కూడా వదిలేసి పిఠాపురంనే టార్గెట్ ఎందుకు చేసుకున్నారనేదానిపై చాలా రకాలుగానే విశ్లేషణలు వస్తున్నాయి. సేనాని నీతి, నిజాయితీ.. నిస్వార్థత, ముక్కుసూటితనం, ప్రశ్నించేతత్వం.. గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఒకానొక సందర్భంలో టీడీపీకి ముచ్చెమటలే పట్టించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్‌కు మేకులాగా తయారయ్యారు. పవన్‌కు ఎలాంటి పదవి  లేకుండానే ఈ రేంజ్‌లో ఆడుకుంటున్నారంటే.. పొరపాటున ఆయన గెలిచి అసెంబ్లీకి వస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే పవన్‌.. వైసీపీ కంట్లో నలుసులాగా మారాడన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. పోనీ.. వైసీపీ వ్యూహాలు టీడీపీపైన.. ఆ పార్టీ పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలు, ముఖ్య నేతలపై మాత్రం అస్సలు ఉండదు. కుప్పంలో ఇదే వ్యూహం ఎందుకు ఉండదు..? ఇదీ పక్కనెడితే.. జగన్ పోటీ  చేసే పులివెందులపై పవన్, చంద్రబాబు ఇద్దరూ ఎందుకిలా  ఫీల్డింగ్ సెట్ చేయలేకపోతున్నారనేది ఎవరికీ అర్థం కాని విషయం. చూశారుగా.. పవన్ ను చేసి.. వైసీపీ ఎలా వ్యూహాలు.. అంతకుమించి కుట్రలు, కుతుంత్రాలు  చేస్తోందో.. ఇన్నింటి మధ్య పవన్ గెలిస్తే ఊహకందని  పరిస్థితులే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

Countless strategies for Pawan!:

Countless strategies for Pawan Kalyan!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement