Advertisement
Google Ads BL

ఫుల్ ఖుషి లో మీనాక్షి చౌదరి


ఖిలాడీ చిత్రంతో డిస్పాయింట్ అయిన తర్వాత హిట్ 2, గుంటూరు కారం లాంటి చిత్రాల అవకాశాలతో ఒక్కసారిగా ఫేమస్ అయిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.. గుంటురు కారం అవకాశం అందుకున్న తర్వాత తమిళనాట క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. ముఖ్యంగా స్టార్ విజయ్ సరసన GOAT లో నటిస్తుంది. ఇప్పుడు తమిళనాట ఆమెని చాలా సినిమాల్లో హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఇక మలయాళ హీరో దుల్కర్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ లోను మీనాక్షి చౌదరినే హీరోయిన్. 

Advertisement
CJ Advs

అయితే ఈరోజు గురువారం రంజాన్ స్పెషల్ గా మీనాక్షి నటిస్తున్న రెండు సినిమాల అప్ డేట్స్ రావడం పాపని బాగా ఎగ్జైట్ చేసాయి. ఆమె నటిస్తున్న లక్కీ భస్కర్ నుంచి టీజర్ విడుదల కాగా.. విజయ్ GOAT  నుంచి రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ రావడంతో మీనాక్షి చౌదరి చాలా హుషారుగా ట్వీట్లు వేసింది. మరి ఏ బర్త్ డే లకో ఇలాంటి రేర్ ఫీట్ సాధించడం చూస్తాము. 

కానీ ఒక పండుగ రోజునతాను నటిస్తున్న రెండు సినిమాల అప్ డేట్స్ వస్తే ఏ హీరోయిన్ కైనా పిచ్చ హ్యాపీగా ఉంటుంది. ఇక ఈ చిత్రాలే కాకుండా వరుణ్ తేజ్ తో మట్కాలో నటిస్తున్న మీనాక్షి.. విశ్వక్ సేన్ తో మరో చిత్రం కమిట్ అయ్యింది. అంటే ఈలెక్కన ఈ ఏడాది మీనాక్షి చౌదరి డైరీ ఫుల్ అన్నమాటే కదా.! 

Meenakshi Chaudhary in Full Khushi:

Meenakshi starrer Lucky Bhaskar Teaser and GOAT release date announcement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs