Advertisement
Google Ads BL

సమంత సిద్దమే.. మరి మీరూ..


సమంత నటనకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో పాటుగా పాడ్ కాస్ట్ అంటూ ఇంటర్వ్యూలతో సమంత తాను సిద్దమే.. మరీ మీరూ అంటూ దర్శకనిర్మాతలకు సంకేతాలు పంపిస్తుంది. సమంత నటనకు రీ ఎంట్రీ అనగానే అదిగో తమిళ్ ఆఫర్, ఇదిగో టాలీవుడ్ ఆఫర్, కాదు కాదు బాలీవుడ్ లోనే సమంత సెటిల్ అయ్యే ఏర్పాట్లలో ఉంది అంటూ చాలానే వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

కానీ ఆమె ఒక్క సినిమా కూడా ఓకె చెయ్యలేదు. ఆమె మాత్రం స్టార్ హీరోల అవకాశం గ్లామర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది అన్న విషయం చిన్నపిల్లలకి కూడా అర్ధమవుతుంది. టూ గ్లామర్ షూట్స్ ని షేర్ చేస్తూ అందరికి హీట్ పెంచుతుంది. మరి సమంత ని బన్నీ-అట్లీ చిత్రంలో హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారనే న్యూస్ అయితే కాస్త గట్టిగానే వినబడుతుంది. మరోపక్క హిందీ ప్రాజెక్ట్ లు సమంత చెంతకు వస్తున్నాయనే టాక్ కూడా ఉంది.

ఇందులో సమంత దేనిని ఓకె చేస్తుందో అంటున్నారు. మరోపక్క సమంత విమెన్ సెంట్రిక్ మూవీస్ కి జై కొడుతోంది అనేవారు లేకపోలేదు. అయితే ఇక్కడ సమంత గ్లామర్ చూపించడానికి ఎక్కుగా కష్టపడుతుంది. అంటే ఆమె గ్లామర్ రోల్స్ కోసమే వెయిట్ చేస్తుంది.. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చెయ్యకపోవచ్చు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సమంత ఏదొక ప్రాజెక్ట్ ఓకె చేసేవరకు ఇలాంటి రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. 

Samantha is ready.. :

Samantha latest photos shoot goes viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs