సలార్ సన్సేషన్ కాంబో మళ్ళీ రెడీ అవుతుంది. గత ఏడాది సలార్ పార్ట్ 1 తో ప్రశాంత్ నీల్ మాస్ గా కాదు ఊరమాస్ గా ఆడియన్స్ ని పడేసారు. ప్రభాస్ దేవా పాత్రలో, పృథ్వీ రాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ కేరెక్టర్స్ లో అభిమానులని మెస్మరైజ్ చేసారు. ఇక ఆద్య పాత్రలో శృతి హాసన్ కనిపించింది. అయితే సలార్ సీక్వెల్ గా తెరకెక్కాల్సిన సలార్ పార్ట్ 2 కి సౌర్యంగ పర్వగా నామకరణం చేసారు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్ 2ని ఇంట్రెస్టింగ్ గా ముగిస్తూ, విపరీతమైన ఆశక్తిని కలిగిస్తూ పార్ట్ 2 పై అంచనాలకు తెర తీశారు.
ఏప్రిల్ నుంచి సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలవుతుంది అంటూ పృథ్వీ రాజ్, బాబీ సింహ లు చెప్పడంతో అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఇప్పటికే పృథ్వీ రాజ్ సుకుమారన్ సలార్ 2 షూటింగ్ కోసం తన సినిమా షూటింగ్స్ కి కొద్దిగా బ్రేక్ ఇచ్చి మరీ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా సలార్ 2 కోసం డేట్స్ కేటాయించేపనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కల్కి షూటింగ్ కొలిక్కి రావడంతో ప్రభాస్ సలార్ 2 కోసం కాల్షీట్స్ సెట్ చేసుకుంటున్నారట.
అలాగే శృతి హాసన్ కూడా సలార్ 2 షూటింగ్ కి సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ 2 కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారంటూ పృథ్వీ రాజ్ చెప్పిన విషయం తెలిసిందే, అయితే మే రెండో వారం నుంచి సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.