ఈటీవీ లో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఢీ సీజన్ లో ప్రస్తుతం సెలెబ్రిటీ సీజన్ నడుస్తుంది. అంటే ఢీ సెలెబ్రిటీ సీజన్ లో శేఖర్ మాస్టర్, ప్రణీత సుభాష్ లు జెడ్జెస్ గా షో నడుస్తుంది. సీరియల్ ఆర్టిస్ట్ లు, సినిమా నటులతో ఈ షో స్టార్ట్ అయ్యింది. అయితే ఈమధ్యన శేఖర్ మాస్టర్ బిజీగా ఉండంతో ఆయన ప్లేస్ లోకి గణేష్ మాస్టర్, అలాగే జానీ మాస్టర్ జెడ్జెస్ గా వస్తున్నారు. ప్రణీత సుభాష్ వీరితో పాటుగా వన్ అఫ్ ద జెడ్జ్ గా కొనసాగుతుంది.
అయితే నిన్న బుధవారం ఎపిసోడ్ లో జానీ మాస్టర్-గణేష్ మాస్టర్ లు ఆది పంచ్ డైలాగ్స్ తో పాటుగా పేరెంట్స్ మధ్యలో కంటెస్టెంట్స్ డాన్స్ పెరఫార్మెన్స్ లని చూసి ఎంజాయ్ చేసారు. ఈ సెలెబ్రిటీ స్టేజ్ పై జానీ మాస్టర్ ఒక అమ్మాయిని తన అసిస్టెంట్ గా చేసుకుంటాను అంటూ అందరి ముందు మాట కూడా ఇచ్చాడు. అయితే నెక్స్ట్ వీక్ అంటే వచ్చే బుధవారం రాబోయే ఎపిసోడ్లో జానీ మాస్టర్ కోపంతో ఊగిపోయిన ప్రోమో వదిలారు.
సాకేత్ మరో కంటెస్టెంట్ పై జానీ మాస్టర్ కోపం తో ఊగిపోయారు. అసలు ఢీ అంటే ఏమనుకుంటున్నారు.. అంటూ మైక్ విసిరికొట్టెయ్యడమే కాదు.. ఢీ షో నుంచి వాకౌట్ చేసిన ప్రోమో వైరల్ గా మారింది. అసలు జానీ మాస్టర్ కి ఆ కంటెస్టెంట్స్ పై ఎందుకు కోపమొచ్చింది, ఎందుకంత ఆగ్రహంతో జానీ వెళ్లిపోయారో అనే క్యూరియాసిటీ ఇప్పడు అందరిలో మొదలయ్యింది.