ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆత్రుత పడి సినిమాలు ఒప్పేసుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తూ కొరటాల శివ తో దేవర చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ లోకి తేబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో NTR 31 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సెన్సేషనల్ కాంబోకి సమయం పట్టేలా ఉండడంతో ఎన్టీఆర్ ఈ లోపు బాలీవుడ్ నుంచి వచ్చిన సదవకాశాన్ని వాడేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ మొదటిసారి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు.
యాష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి బిగ్ బ్యానర్ లో స్టార్ హీరో హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సెట్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. గత నెలలోనే హృతిక్ రోషన్ వార్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఎన్టీఆర్ కూడా హృతిక్ తో వార్ కి రెడీ అయ్యాడు. రేపు శుక్రవారమే వార్ 2 షూటింగ్ లో పాల్గొనెందుకు ఎన్టీఆర్ ముంబై వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక్కడ దేవర కి సంబందించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసి.. వార్ 2 షూటింగ్ కి ఎన్టీఆర్ పయనమైనట్లుగా టాక్. అక్కడ ముంబై లో వార్ 2 కి సంబందించిన లెంతి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కి వస్తాడని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ దేవర చిత్ర నార్త్ రైట్స్ ని బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ వారు మరో బ్యానర్ ఏఏ ఫిల్స్ తో కలిసి దక్కించుకోవడం ఇప్పుడు ఎన్టీఆర్ కి బిగ్ అస్సెట్ గా మారింది.
అటు వార్ 2 షూటింగ్, ఇటు దేవర ని బాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండడంతో NTR అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.