Advertisement
Google Ads BL

సలార్ 2 విడుదలపై పృథ్వీ రాజ్ కామెంట్స్


సలార్ పార్ట్ 1 చిత్రంతో ప్రభాస్-ప్రశాంత్ నీల్-పృథ్వీ రాజ్ సుకుమారన్ లు మాస్ హిట్ కొట్టారు. సలార్ పాన్ ఇండియా మార్కెట్ లో సన్సేషనల్ కలెక్షన్స్ నమోదు చేసాయి. దేవా గా ప్రభాస్, వరద రాజమన్నార్ గా పృథ్వీ రాజ్ ల లుక్స్, యాక్షన్ అన్ని మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. సలార్ పార్ట్ 1 కి సీక్వెల్ గా సలార్ పార్ట్ 2 సౌర్యంగా పర్వ గా అనౌన్స్ చేసి మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్.  

Advertisement
CJ Advs

ప్రశాంత్ నీల్ సలార్ 2 పై ఎక్కడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోయినా.. అందులో నటించిన పృథ్వీ రాజ్ సుకుమారన్, బాబీసింహాలు అప్పుడప్పుడు సలార్ 2 పై క్రేజీ అప్ డేట్స్ అందిస్తున్నారు. ఈ నెలలో అంటే ఏప్రిల్ నుంచి సలార్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.. అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్.. చెప్పడంతో ప్రభాస్ ఫాన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు తాజాగా పృథ్వీ రాజ్ సుకుమారన్ లార్ 2 రిలీజ్ డేట్ పై మరో క్రేజి అప్ డేట్ అందించారు. పృథ్వీ రాజ్ వరస సినిమాలతో బాగా బిజీగా వుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సలార్ కోసం కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నట్లుగా చెప్పారు. 

అంతేకాకుండా సలార్ 2 కథ సిద్ధంగా ఉంది, ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. సలార్ 2 ఖచ్చితంగా 2025 లో విడుదలవుతుంది. ఖచ్చితమైన తేదీ మాత్రం దర్శకనిర్మాతల చేతుల్లో ఉంటుంది, సలార్ 2 కి సంబందించిన కొన్ని సీక్వెన్స్ పూర్తి చెయ్యడానికి కి నేను ఎల్ 2, ఎంపురాన్ చిత్రాల షూటింగ్స్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ సలార్ 2 పై ఇచ్చిన అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. 

Prithviraj Shares BIG Update About Salaar 2:

Prithviraj Sukumaran says Prashant Neel Has An Efficient Plan To Shoot Salaar 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs