Advertisement
Google Ads BL

అందుకే బన్నీ-అట్లీ కాంబో ప్రకటన రాలేదా?


అల్లు అర్జున్ బర్త్ డే రోజున అల్లు అర్జున్-కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ కలయికలో చెయ్యబోయే మూవీ ప్రకటన వస్తుంది అని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవి చంద్రన్ కూడా ఫిక్సవడంతో ఈ కాంబో కి AAA అనే వర్కింగ్ టైటిల్ గా నామకరణం చేసి అల్లు ఫాన్స్ ఆనందపడ్డారు. ఇక హీరోయిన్స్ గా సమంత, త్రిషలని అట్లీ అల్లు అర్జున్ కోసం ప్రిఫర్ చేస్తున్నాడనే న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఈ కాంబో పై అల్లు అర్జున్ బర్త్ డే రోజున క్లారిటీ వస్తుంది అనుకున్నారు. 

Advertisement
CJ Advs

తీరా అల్లు అర్జున్-అట్లీ కాంబో పై ఎలాంటి అప్ డేట్ రాకపోయేసరికి అల్లు ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. అయితే తాజాగా అందుతున్న సంచారమేమిటంటే.. అల్లు అర్జున్-అట్లీ కాంబోపై ప్రకటన రాకపోవడానికి ప్రధాన కారణం.. ఈ చిత్ర బ్యానర్ పై నెలకొన్న సందిగ్దత అని తెలుస్తోంది. అది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తమిళనాట సన్ పిక్చర్స్ కి ఓ మూవీ చెయ్యాల్సి ఉండడంతో అదే బ్యానర్ లో అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నాడట. 

కానీ అల్లు అర్జున్-అట్లీ క్రేజీ కాంబో పై ఉన్న అంచనాలతో గీత ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని చేయాలనుకోవడం, అల్లు అర్జున్ కూడా ఓన్ బ్యానర్ వైపే మొగ్గు చూడంతో ఏర్పడిన గందరగోళం కారణంగానే అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఈ చిత్రంపై అప్ డేట్ రాలేదు అంటున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ తో పాటుగా, గీతా ఆర్ట్స్ క‌లిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా మొదలయ్యాయి అని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చి ఈ క్రేజ్ కాంబో పై అప్ డేట్ కూడా వదులుతారని తెలుస్తోంది. 

That's why the Allu Arjun-Atlee combo was not announced?:

Atlee Kumar Movie Combo With Allu Arjun update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs