తెలుగు వారికి ఉగాది పండుగ అంటే ఎంత ప్రత్యేకతో అందరికి తెలిసిందే. ఆ రోజు చాలా మంది కొత్త కొత్త పనులని అంటే వ్యాపారంలోకి దిగడం, దానికి సంబంధించి పూజలు నిర్వహించడం, కొత్తింటి గృహ ప్రవేశాలు, ఏదైనా ఒక పనిమొదలు పెట్టేందుకు తెలుగు వారు ఉగాది పండుగనే చూజ్ చేసుకుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే సినిమాల ఓపెనింగ్స్, కొత్త పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్స్, సినిమాల ఎనౌన్సమెంట్స్ అంటూ అప్ డేట్స్ తో తెగ హడావిడి చేస్తారు.
అందుకే ఉగాది వస్తుంది అంటే స్టార్ హీరోల అభిమానుల దగ్గర నుంచి చిన్నహీరోల అభిమానుల వరకు అలెర్ట్ గా ఎదురు చూస్తారు. అయితే ఎప్పటిలాగే ఉగాదికి కొత్త సినిమాల ఓపెనింగ్స్, కొత్త సినిమాల పోస్టర్స్ అంటూ హడావిడి చేసినా అందులో స్టార్ హీరోలకి సంబందించిన అప్ డేట్స్ లేకపోవడంతో స్టార్ హీరోల అభిమానులు నిరాశ చెందారు.
అల్లు అర్జున్ ఉగాదికి ఒక రోజు ముందే పుష్ప టీజర్ ని బర్త్ డే స్పెషల్ గా ఇచ్చెయ్యడంతో ఉగాదిని లైట్ తీసుకున్నారు. ఎన్టీఆర్ దేవర నుంచి కొత్త పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తే అది రాలేదు, ఇక గేమ్ చెంజర్ నుంచి విడుదల తేదీ అనుకుంటే అదీ లేదు, ప్రభాస్ కల్కి తేదీ మారుస్తున్నట్లుగా చెప్పారు. ఆ అప్ డేట్ ఖచ్చితంగా ఉంటుంది అని ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూసారు, కానీ లేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా మహేష్ బాబు-రాజమౌళి SSMB 29 పై మహేష్ ఫాన్స్ దగ్గర నుంచి హాలీవుడ్ వరకు నిన్న ఉగాదికి అప్ డేట్ వస్తుంది అనుకుంటే.. ఆ విషయంలోనూ నిరాశ పడాల్సి వచ్చింది, బాలయ్య NBK 109 టైటిల్ అంటూ ఊదరగట్టారు, కానీ మేకర్స్ ఉగాది ని వదిలేసారు. ఇలా నిన్న ఉగాది ని స్టార్ హీరోలంతా చాలా డల్ గా అభిమానులని డిస్పాయింట్ చేస్తూ ముగించారు.