మెగాస్టార్ చిరంజీవి ఏజ్ ని లెక్క చెయ్యకుండా ఇంకా ఇంకా యాక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. ఫిట్ గా కనిపించడం కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. తన రోల్ ఎలా ఉంటుందో దాని కోసం పూర్తిగా మేకోవర్ అయ్యేందుకు కష్టపడతారు. ఆచార్య సమయంలో ఆయన లుక్స్ విషయంలో విమర్శలొచ్చినా.. ఆతర్వాత మళ్ళీ మెగాస్టార్ సన్నబడి ఫిట్ గా మారారు.
భోళా శంకర్ నిరాశపరిచిన తర్వాత మెగాస్టార్ బిగ్ బ్రేక్ తీసుకుని వసిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న విశ్వంభర లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం మెగాస్టార్ తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా రిస్కీ షాట్స్ సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు. విశ్వంభర లో మెగాస్టార్ లుక్ పై అందరిలో ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా చిరు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఐదు కోట్ల భారీ విరాళం ఇచ్చారు.
దాని కోసం పవన్ కళ్యాణ్ విశ్వంభర సెట్స్ కి వెళ్లగా చిరు విశ్వంభర లుక్ లో కనిపించారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో చిరంజీవి యంగ్ క్యారెక్టర్ కి సంబందించిన సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యి కొత్త లుక్ లోకి మారారంట. భారీ విరాళం ఇచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో చిరు ఫొటోస్ దిగారు. అప్పుడు కనిపించిన చిరంజీవి సూపర్బ్ లుక్స్ ని క్లోజ్ అప్ లో ట్రిమ్ చేసి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నిజంగా మెగాస్టార్ ని అలా చూడగానే బాస్ ఏమున్నాడ్రా బాబు అని కామెంట్ చెయ్యకుండా ఉండరు.