నందమూరి అభిమానులు ఈరోజు ఉగాది సందర్భంగా బాలకృష్ణ నటిస్తున్న NBK 109 నుంచి టైటిల్ వస్తుంది అని ఎంతో సంబర పడ్డారు. NBK 109 నుంచి టైటిల్ రాలేదు కానీ మరో గుడ్ న్యూస్ విన్నారు నందమూరి అభిమానులు. అది ఆహా టాక్ షో అంటే అన్ స్టాపబుల్ సీజన్ 4 రాబోతుంది. ఉగాది పండుగ సందర్భంగా ఆహా వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేసింది.
నందమూరి అభిమానులనే కాదు, కామన్ ఆడియన్స్ ని కూడా బాలయ్య తన టాక్ షో తో ఉర్రుతలూగించారు. సరదాగా, ఉత్సాహంగా సాగుతున్న అన్ స్టాపబుల్ టాక్ షోని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అందుకే ఇప్పుడు సీజన్ 4 ని కూడా అనౌన్స్ చేసారు.
ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. ఇక ఇప్పుడు నాల్గవ సీజన్ కి సమయం ఆసన్నమైంది. ఈ సీజన్ కి కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. కాకపోతే అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విత్ ఎ ట్విస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. మారా ట్విస్ట్ ఏమిటి అనే దానిపై అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.