Advertisement
Google Ads BL

ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ నిజంగా కామెడీనే !


అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం విడుదలై ఈ నెల చివరి వారానికి ఖచ్చితంగా ఏడాది పూర్తవుతుంది. ఏప్రిల్ లో విడుదలైన ఏజెంట్ చిత్రం థియేటర్లు లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. అఖిల్ అక్కినేని కి ఈ చిత్రం దారుణమైన ప్లాప్ ని అంటగట్టింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. 

Advertisement
CJ Advs

అయితే ఏజెంట్ చిత్రం థియేటర్స్ లో విడుదలయ్యాక ఆ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలామంది ఓటీటీ ఆడియన్స్ ఎదురు చూసారు. సోని లివ్ నుంచి ఏజెంట్ స్ట్రీమింగ్ లోకి వస్తుంది అని తరచూ ప్రచారం జరగడం, ఆ తర్వాత డిస్పాయింట్ అవ్వడం చూస్తూనే ఉన్నాము. మరి ఏజెంట్ విడుదలై ఏడాది పూర్తయ్యింది ఏజెంట్ స్ట్రీమింగ్ పై ఓ అభిమాని అనిల్ సుంకరిని ట్యాగ్ చేస్తూ ఏజెంట్ ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారని అడిగాడు. 

ఆ ప్రశ్నకు నిర్మాత అనిల్ సుంకర బదులిచ్చారు. నేను ఇప్పటికే రెండు సార్లు చెప్పాను. మేము డిజిటల్‌ రైట్స్ ని బి4యు వారికి విక్రయిస్తే వారు వాటిని సోనీ లివ్ కి అమ్ముకున్నారు. కాబట్టి త్వరలోనే ఏజెంట్ ఓటిటిలోకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. మరి సోని లివ్ వారు ఏజెంట్ స్ట్రీమింగ్ విషయంలో ఇంత లైట్ గా ఉన్నారేమిటో? కానీ ఏజెంట్ స్ట్రీమింగ్ విషయంలో మాములు కామెడీ జరగడం లేదుగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Agent OTT streaming is really comedy:

There is a chance that the Agent will be released in OTT soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs