నిజంగానే సినిమా ఇండస్ట్రీలో కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఒకరు చెయ్యాల్సి కథని మరొక హీరో చెయ్యడమో, లేదంటే మారేదన్నానో జరిగి ఒక హీరోకి రావాల్సిన విజయం మరొక హీరోకి, ఒక హీరోకి రావాల్సిన ప్లాప్ ఇంకో హీరోకి తగులుతూ ఉంటాయి. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ కామన్. గతంలో సుకుమార్ మహేష్ కి పుష్ప కథ చెబితే మహేష్ టెక్నీకల్ గా కుదరదన్నారు. అదే కథ తో బన్నీతో పుష్ప చేసి సుక్కు బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు.
ఇప్పుడు నాగ చైతన్య తృటిలో ప్లాప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. పరశురామ్ తో నాగ చైతన్య ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఫ్యామిలీ స్టార్ కథతో చైతు దగ్గరకి వెళ్లిన పరశురామ్ ని చైతు పక్కనబెట్టాడో, లేదంటే పరశురామ్ దిల్ రాజు బ్యానర్ లో చైతూని పక్కన బెట్టి విజయ్ దేవరకొండ తో సినిమా చేసాడో కానీ.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ నుంచి చైతు తప్పించుకున్నాడని అక్కినేని అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫలితమెలా ఉందో సోషల్ మీడియాలో చూస్తే ఈజీగా అర్ధమైపోతుంది. ఫ్యామిలీ స్టార్ విజయ్ కి పరశురామ్ కి హోల్సేల్ షాకిచ్చినట్టే కనిపిస్తుంది.
అందుకే నాగ చైతన్య తో పరశురామ్ చెయ్యాల్సిన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ తో చెయ్యగా.. ఆ ప్లాప్ కి విజయ్ బుక్ అయ్యి, నాగ చైతన్య ఎస్కేప్ అయ్యాడంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.