Advertisement
Google Ads BL

కొత్తింట్లోకి పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికి.. జనసేన, కూటమి తరపున పోలిటికల్ గా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా ఏపీ లో తాను బలంగా నిలబడాలి అంటే హైదరాబాద్ నుంచి మకాం ఏపీకి మార్చాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడో మంగళగిరిలో ఓ ఇంటిని కొనుగోలు చేసారు. అక్కడే జనసేన ఆఫీస్ ని నిర్మించి యాగాలు అవి చేస్తూ ఉంటారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 

Advertisement
CJ Advs

పిఠాపురంలో ఇల్లు కూడా లేదు, అక్కడి ప్రజలకి పవన్ ఏం చేస్తాడని వైసీపీ నేతలు వ్యంగ్యంగా ఎటాక్ చెయ్యడం మొదలు పెట్టారు. అయితే పవన్ కళ్యాణా నెక్స్ట్ మినిట్ లోనే గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో ఓ ఇల్లు కొనేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు అన్ని వసతులతో సిద్దమవగా నేడు ఉగాది రోజున  పవన్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో గృహప్రవేశం చెయ్యబోతున్నారు. 

కొత్త గృహంలోనే ఉగాది వేడుకలు నిర్వహించబోతున్నారు. ఉదయం గృహప్రవేశం అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్.. నూతన గృహ ప్రవేశానికి అలాగే ఉగాది వేడుకలకు ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఉగాది వేడుకల అనంతరం పవన్ పిఠాపురం నియోజకవర్గంలో తదుపరి పర్యటన, మిగతా అంశాల పై నేతలతో చర్చించనున్నగా తెలుస్తోంది. 

Pawan Kalyan To Enter New House :

Pawan Kalyan To Enter New House In Pithapuram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs