Advertisement
Google Ads BL

దేవర డైలాగ్ లీక్ చేసిన ఎన్టీఆర్


సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ మూవీ టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అవడంతో ఈరోజు ఎన్టీఆర్-త్రివిక్రమ్ లు ముఖ్య అతిధులుగా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫన్నీ ఫన్నీగా మాట్లాడాడు... 

Advertisement
CJ Advs

అందరికీ నమస్కారం. మిమ్మల్ని(అభిమానులను) చూసి, మాట్లాడి చాలా రోజులైంది. ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులకు, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. సిద్ధు నటించిన చాలా సినిమా చూశాను. కానీ అతనిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. పాండమిక్ తర్వాతే మొదటిసారి సిద్ధుని కలవడం జరిగింది. సినిమా అంటే పిచ్చి ఉండే టెక్నీషియన్లు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సిద్ధు మొదటి వరుసలో ఉంటాడు. తనకి సినిమా తప్ప వేరే ఏమీ తెలీదు. 

డీజే టిల్లు అనే పాత్రని చూసి అతను నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడని మీకు అనుకోవచ్చు. కానీ సిద్ధు అలా కాదు. ఎంతసేపూ తన సినిమా, తను చేస్తున్న పాత్ర, తను రాస్తున్న కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన ఉంటుంది. చాలా తక్కువమంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ లో ఈ తపనను చూస్తాం మనం. డీజే టిల్లుతో సిద్ధు కేవలం విజయాన్ని అందుకోవడమే కాకుండా.. మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక పాత్రను ఇచ్చాడు. చాలాసార్లు అనుకునేవాడిని. చిన్నప్పుడు కార్టూన్స్ బాగా చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల ద్వారా మన లైఫ్ లో మిగిలిపోతే బాగుంటుందని కోరుకునే వాడిని. ఈరోజు టిల్లు.. మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. 

హాట్సాఫ్ సిద్దు జొన్నలగడ్డ.. మన ఇంట్లో ఉండిపోయి మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు. నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం. నేను నవ్వడం మొదలుపెడితే, దాన్ని ఆపుకోవడం చాలా కష్టం. నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ అన్న చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని.. ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది. అరవింద సమేత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు కూడా ఫేస్ చేశారు. అలాంటిది నేనింకా నవ్వలేను బాబోయ్ అనే అంతలా నవ్వించాడు సిద్దు ఈ సినిమాతో. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను.

దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి.. ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్(త్రివిక్రమ్ తో సరదాగా నవ్వుతూ). త్రివిక్రమ్ గారిని చూసి చాలా రోజులైంది. ఆయనను చూస్తుంటే అరవింద సమేత రోజులు గుర్తుకొస్తున్నాయి. మనిషికి కల కనడానికి ధైర్యం ఉండాలి, ఆ కలను నిజం చేసుకోవడానికి క్రమశిక్షణ అంటే భయం ఉండాలి. టిల్లు చిత్ర బృందం అంత భయపెడుతూ భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించాలని కష్టపడ్డారు కాబట్టి.. అంతటి ఘన విజయం సాధించింది. 

కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. కష్టానికి కొలమానం లేదు. కష్టాన్ని ఇలాగే నమ్ముకో.. మరింత ఉన్నస్థాయికి వెళ్తావు సిద్ధు. నేను సిద్ధుకి, విశ్వక్ కి చాలాసార్లు చెప్పాను. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. భవిష్యత్ లో మీ ఇద్దరూ కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీకి మీ ఇద్దరూ ఎంతో ఉపయోగపడతారని చాలాసార్లు వాళ్లకి చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే.. చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి. ఒక బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించడం అంత తేలికైన విషయం కాదు. సీక్వెల్ ని అద్భుతంగా తెరకెక్కించిన మల్లిక్ రామ్ గారికి హ్యాట్సాఫ్. అలాగే ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. కాసర్ల శ్యామ్ గారు రాసే పాటలంటే మాకు ఇష్టం. ఆయన రాసే పదాల నుంచి మట్టి వాసన వస్తుంది. అలాగే నేహా గారు, అనుపమ గారు అద్భుతంగా నటించారు. వారిద్దరూ లేకపోతే ఈరోజు ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. వంశీ నిర్మాతగా ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. దేవర సినిమా విడుదల లేట్ అయినా మీరు అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా అందించడానికి ప్రయత్నిస్తాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటూ ముగించారు. 

NTR leaked Devara dialogue:

Jr NTR Full Speech At Tillu Square Success Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs