నేషనల్ క్రష్ రష్మిక సంపాదనలో పడిపోయి జనాలు ఎంజాయ్మెంట్ అంటే ఏమిటో మర్చిపోతున్నారు, డబ్బు, ఇల్లు, ఖరీదైన కారు అన్ని ముఖ్యమే. అలా అని కేవలం డబ్బు సంపాదనే ముఖ్యం కాదు, అప్పుడప్పుడు మన కోసం మనం టైమ్ స్పెండ్ చెయ్యాలి అంటూ ఫిలాసఫి చెప్పుకొస్తుంది. రష్మిక మందన్న రీసెంట్ గా తన బర్త్ డే ని ఫ్రెండ్స్ తో కలిసి చేసుకుంది. తాను నటిస్తున్న సినిమా అప్ డేట్స్ బర్త్ డే విషెస్ తో కలిసి వస్తుంటే ఆ ఆనందం ఒక వైవు, స్నేహితులతో సరదాగా గడుపుతూ బర్త్ డే పార్టీని ఎంజాయ్ చెయ్యడం మరోవైపు అన్నట్టుగా ఉంది రష్మిక పని.
టాలీవుడ్, తమిళ, బాలీవుడ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ.. ప్రతి రోజు ఇదే మనకి చివరి రోజు అని మనం జీవించాలి, అది బోర్ కొట్టినా సరే.. అలానే ఉండాలి. మనం సంపాదించిన దానిలోనే మనం ఖర్చు పెట్టుకోవాలి, బిల్లు కట్టడం దగ్గర నుంచి దేనికైనా మన డబ్బే వాడుకోవాలి. సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా మనకంటూ మనం గౌరవం సంపాదించుకోవాలి.
కలలు - లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. చదవడంలోనూ, క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలనే తాపత్రయం ఉండాలి. కాలేజ్ లో సీట్, మంచి కంపెనీలో జాబ్ కొట్టాలని కసి ఉండాలి. ఇలాంటి లక్ష్యాలతో మనకు జీవితంలో ఏది ముఖ్యమనే విషయం మరిచిపోతాం. దానివల్ల మన సంతోషాన్ని కోల్పోతామని ఎంత మందికి తెలుసు. మనం అందుకోలేని దాన్ని టార్గెట్ చేయడంతోనే ఈ సమస్య మొదలవుతుంది.